పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహం ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా వీరు స్నేహితులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. పవన్ పక్కన ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తప్ప మరొకరు కనిపించడం లేదు.. ఇప్పటి వరకు వీరు మూడు సార్లు కలిసి పని చేసారు.. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా.. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేయక పోయిన పవన్ కళ్యాణ్ సినిమాలలో త్రివిక్రమ్ హ్యాండ్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే.. భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ ఈయన పేరుకు మాత్రమే పరిమితం కాగా డైరెక్ట్ చేసింది మాత్రం త్రివిక్రమ్ అనే టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు రాబోతున్న బ్రో విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
పవన్ తో సాయి తేజ్ సినిమా సెట్ చేయడం స్రీన్ ప్లే, మాటలు, తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ మార్చడం అన్నిటి వెనుక గురూజీ హస్తం ఉందట.. పేరుకు మాత్రమే సముద్రఖని డైరెక్టర్.. ప్రజెంట్ పవన్ ఎవరితో సినిమా చేయాలి? ఏ సినిమా చేయాలి? హీరోయిన్ ఎవరు? అనే అన్ని విషయాలు త్రివిక్రమ్ నిర్ణయాలేనని టాక్..
మరి త్రివిక్రమ్ పవన్ ప్రాజెక్ట్ లో ఇంవోల్వ్ అవ్వడంతో ఈయనకు ఒక్కో సినిమాకు 15 నుండి 20 కోట్లు అందుకుంటున్నాడట.. ఇలా పవన్ చేసే సినిమాలతో త్రివిక్రమ్ భారీగా వెనుకేస్తున్నాడు. ఇక ఈయన డైరెక్ట్ చేసే సినిమాలకు 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.
ReplyForward
|