30.8 C
India
Wednesday, May 8, 2024
More

    సినిమా రంగంలోకి అడుగుపెట్టిన డాక్టర్ జై యలమంచిలి

    Date:

    dr. jai yalamanchili entry into tollywood
    dr. jai yalamanchili entry into tollywood

    ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్ జగదీశ్ యలమంచిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణా జిల్లా కుర్రోడు జగదీశ్ యలమంచిలికి చిన్నప్పటి నుండే సినిమాలంటే చాలా చాలా ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణ కు వీరాభిమాని. సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసారు. అయితే సినిమాల మీద ఎంతగా అభిమానం ఉన్నప్పటికీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

    ఉన్నత చదువులు చదివి అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడ్డారు. పలు సంస్థలు స్థాపించి పారిశ్రామికవేత్తగా అవతరించారు. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే రక్త కొరతతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని భావించి అందుకొసం ” U Blood  App ” ను సృష్టించారు. ఈ యాప్ సర్వరోగ నివారిణి లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందులో ఒక్కసారి తమ వివరాలను పొందుపరిస్తే రక్తదాతల వివరాలతో పాటుగా రక్త గ్రహీతల వివరాలు కూడా ఉంటాయి. దాంతో రక్తదాతలకు రక్తగ్రహీతలకు అనుసంధానంగా నిలిచింది యు బ్లడ్ యాప్. ఇక ఈ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటులు సోనూ సూద్ వ్యవహరిస్తున్నారు.

    ఇక సినిమా రంగం విషయానికి వస్తే ……. డాక్టర్ జగదీశ్ యలమంచిలికి సినిమాలంటే ప్రాణం…..  దాంతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. తన ఎదుగుదలకు , ఈరోజు ఇంతటి అత్యున్నత స్థాయిలో ఉండటానికి కారకుడైన తన తండ్రి యలమంచిలి కృష్ణమూర్తి పేరునే నిర్మాతగా వేస్తూ చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు డాక్టర్ జై యలమంచిలి. యంగ్ హీరో త్రిగున్ హీరోగా ” అవసరానికో అబద్దం ” అనే విభిన్న కథా చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సినీ రంగ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలిని అభినందించారు……. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక.. షాకింగ్ విషయాలు

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన...

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Bhashyam Praveen : 50వేల ఓట్ల మెజారిటీతో భాష్యం ప్రవీణ్ ని గెలిపిస్తాం..

    Bhashyam Praveen : రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి...

    Jai Swaraajya TV Survey : జై స్వరాజ్య టీవీ సర్వే: మంగళగిరిలో లోకేష్ గెలుపుపై షాకింగ్ అంచనాలు

    Jai Swaraajya TV Survey : త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...