41.5 C
India
Monday, May 6, 2024
More

    ఎన్టీఆర్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్

    Date:

    saif ali khan in NTR30
    saif ali khan in NTR30

    తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంతో చాలా సంతోషంగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆస్కార్ అవార్డు అనేది తెలుగు సినిమా ఊహించడమే కష్టం అనుకుంటున్న సందర్భం నుండి ఆస్కార్ సాధించే వరకు తెలుగు సినిమా ప్రయాణంలో తాను ఉన్నందుకు గర్వపడుతున్నాడు ఎన్టీఆర్. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.

    కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ సినిమా ఈనెల 23 న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా  ప్రారంభం కానుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.

    ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ తో తలపడనున్నాడు. ఎన్టీఆర్ 30 కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి నిర్మించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు NDA Government :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...