38.4 C
India
Monday, May 6, 2024
More

    ఉదయం నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నిప్రయోజనాలో తెలుసా?

    Date:

    water
    water
    మనకు మంచినీరు ప్రాణాధారం. జీవాలన్నింటికి కూడా జీవాధారం. మంచి నీళ్లు తాగని జీవి ఉండదు. ఆఖరుకు చెట్టకు కూడా నీరు ఆధారమే. ఇలా నీటికి ఉన్న విలువ అలాంటిది. నీరు లేనిదే జీవం లేదు. ప్రపంచమే లేదు. తిండి తినకుండా ఉండగలమేమో కానీ నీళ్లు తాగకుండా ఉండలేం. నీటికి మనకు ఉన్న సంబంధం అలాంటిది. ఈ నేపథ్యంలో మనం ఉదయం లేవగానే ఓ గ్లాసు నీరు తాగితే ఎన్నో లాభాలుంటాయి. ఇది అందరు పాటిస్తున్నారు కూడా. ఉదయం పూట నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

    ఉదయం పూట కొందరికి ఆకలి బాగా వేస్తుంది. అలాంటి సమయంలో నీళ్లు తాగితే బాగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. నీటికి అంతటి శక్తి ఉంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే లీటరు పావు నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. ఉదయం నీళ్ల తాగితే మన మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. శరీరం హైడ్రేడ్ గా ఉంటే మెదడుకు ఏకాగ్రత పెరగుతుంది.

    ఉదయం లేవగానే చాలా మంది ఆవలింతలు తీస్తుంటారు. దీనర్థం బద్ధకంగా ఉండటమే. ఓ గ్లాసు నీరు తాగితే అది కాస్తదూరమవుతుంది. చురుకుదనం వస్తుంది. నీరసం లేకుండా పోతుంది. నీళ్లు తాగడం వల్ల చర్మానికి ముడతలు రాకుండా ఉంటాయి. శరీరంలోని మలినాలను దూరం చేస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ఉదయం నీళ్లు తాగడం శ్రేయస్కరం.

    శరీరం డీ హైడ్రేడ్ కు గురైతే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఇంకా శరీరంలో వాపులు, నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నీళ్లు తాగడమే మందులా పనిచేస్తుంది. రాత్రి సమయంలో మన శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుంటాయి. ఇలాంటి వారికి ఉదయం నీళ్లు తాగితే మళ్లీ సాధారణ స్థితికి చేరుతాయి. ఇలా మంచినీరు మన జీవితంతో పెనవేసుకుపోయింది. అందుకే నీళ్లు తాగడం వల్ల మనకు మంచి ప్రయోజనాలే ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water Problem : ఎండలే కాదు గుండెలూ మండుతున్నాయ్, గొంతులు ఆరుతున్నాయ్!

    మార్చి 3వ తేదీకి -- water problem : ఉభయ తెలుగు రాష్ట్రాలలో...

    Water Benefits : మంచినీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Water Benefits : మన ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం. మన...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....

    Tamarind Juice : చింతపండు రసం తాగడం వల్ల లాభాలెన్నో?

    Tamarind Juice : మన భారతీయ వంటకాల్లో చింతపండు ప్రత్యేకత కలిగినది....