40 C
India
Sunday, May 5, 2024
More

    Karimnagar : కరీంనగర్ ప్రజలకు సారీ.. చెప్పిందెవరంటే?

    Date:

    Karimnagar, the kerala story director
    Karimnagar, the kerala story director

    Karimnagar People : కరీంనగర్ ప్రజలకు ఓ ప్రముఖ దర్శకుడు క్షమాపణలు చెప్పారు. ఆయనెవరో కాదు.. ప్రస్తుతందేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కేరళ స్టోరీ చిత్రం దర్శకుడు. ఎన్నో వివాదాలు, తిరస్కరణలు, మద్దతు, నిషేధాలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రస్తుతం ఈ సినిమా నడుస్తున్నది. అయితే ఆయన ఆదివారం తెలంగాణలోని కరీంగనర్ ప్రజలకు సారీ చెబుతూ ఒక ట్వీట్ చేశారు.

    కరీంనగర్ కే ఎందుకంటే..

    కరీంనగర్ (Karimnagar ) అంటేనే పవర్ ఫుల్. సంచలనాలకు కేంద్ర బిందువు. ఉద్యమమైనా రాజకీయమైనా కరీంనగర్ కు చైతన్యమెక్కువ. అయితే దోస్తీ లేదంటే కుస్తీ. అయితే కరీంనగర్ లో ఆదివారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ రావాల్సి ఉంది. కానీ ఆయన హాజరవలేదు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను ఇంత మంచి కార్యక్రమానికి రాలేకపోయానని, కరీంనగర్ ప్రజలకు ఈ మేరకు క్షమాపణలు చెబుతున్నటు్ల ట్వీట్ చేశారు.

    ఈ సినిమా గురించి మీతో చర్చించాలనుకున్నాను.. మన బిడ్డల జీవితాలతో ముడి పడి ఉన్న ఈ సినిమాను మీరు ఆదరించాలని కోరారు.  అయితే అస్వస్థతకు గురికావడం కారణంగా కరీంనగర్ రాలేకపోతున్నానని చెప్పారు.  దర్శకుడు సుదీప్తో సేన్ హీరోయిన్ ఆదాశర్మ కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కొంత అనారోగ్యంగా ఉండడంతో రాలేదని భావిస్తున్నారు. బాలీవుడ్ స్థాయి దర్శకుడు కరీంనగర్ ప్రజలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఏదేమైనా కరీంనగర్ మాత్రం మరోసారి కీలక వార్తల్లోకెక్కింది.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Farmhouse CM : ఫాంహౌస్ సీఎంను ఇంటికి సాగనంపండి

    Farmhouse CM : తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో...