35.1 C
India
Thursday, May 9, 2024
More

    Karnataka Congress : కర్ణాటకలో పీతల పంచాయతీ.. ఇక ఆ సంక్షోభం తప్పదా..?

    Date:

    Karnataka Congress
    Karnataka Congress, Karnataka cm

    Karnataka Congress : కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం పదవి కోసం రెండు వర్గాల మధ్య బిగ్ ఫైట్ నడించింది. నేతల కుటుంబ సభ్యులు మాకంటే మాకే ఇవ్వాలని ప్రకటనలు చేయడంతో పాటు ఫ్లెక్సీలతో కూడా ఇరు వైపులా వార్ నడిచింది. ఇంత సస్పెన్స్ వీడి అధిష్టానం సిద్ధరామయ్యకే కర్ణాటక పగ్గాలు అప్పజెప్పింది. రెండు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను డీకే శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.

    కర్ణాటకలో ఈ సారి ప్రభుత్వం మారడం కామనే. కానీ ఇంత భారీ మెజారిటీ వచ్చేందుకు కారణం మాత్రం డీకే శివకుమార్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని డీకే శివకుమార్ శపథం చేశారు. ఆ మేరకు ఆయన కష్టపడ్డాడు. పార్టీ కేడర్ ను మందుండి నడిపించాడు. ఫలితంగా బీజేపీ, జేడీఎస్ ను ఉమ్మడిగా సాధించిన సీట్లకంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్నారు. దీనికంతటికీ డీకే శివకుమార్ సారధ్యం అంటూ కర్ణాటక మొత్తం చెప్పుకుంటుంది.

    సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయనకు అనుభవం ఎక్కువ. దీనికి తోడు ఆయన సీనియర్ నాయకుడు. ఇవన్నీ సిద్ధరామయ్యకు కలిసి వచ్చే అంశాలు. తనకే సీఎం పదవి కావాలని డీకే, సిద్ధ ఇద్దరూ పట్టు బట్టారు. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో కూడా సిద్ధరామయ్య పేరు వినిపించడంతో ఆయనకే సీఎం పదవి కట్టబెట్టింది అధిష్టానం.

    సిద్ధరామయ్య ప్రభుత్వం చివరిక వరకూ కొనసాగుతుందా..? అనే అనుమానాలు కర్ణాటకలో ఇప్పుడు చాపకింద నీరుగా వినిపిస్తున్న అంశం. దీనికి కారణం లేకపోలేదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ముందు వరకూ డీకేకు సిద్ధరామయ్యకు విభేదాలు కొనసాగాయి. ఈ యాత్రలో వీరిద్దరిని కలిపేలా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చర్చలు నిర్వహించి సఫలీకృతులయ్యారు. అయితే కాంగ్రెస్ గెలవడంలో మా నాయకుడి పాత్ర అంటే..  మానాయకుడి పాత్ర ఎక్కువ అని డీకే, సిద్ద రామయ్య వర్గీయుల వాదనలు బయటకు వచ్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు సిద్ధ రామయ్య సీఎం అయ్యాడు.

    అయితే డీకే డిప్యూటీతో సంతృప్తిగా లేనట్లు ఆయన వర్గం నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యా వైరుద్యాలు ఎక్కువై చీలిపోతే మళ్లీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం లేకపోలేదని కన్నడిగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలానికి కాకుండా పూర్తి ఐదేళ్ల పాటు డిప్యూటీ బాధ్యతలు డీకేనే కొనసాగించాలంటే రాజకీయ ఇబ్బందులు కలుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కలిసి ఉన్నట్లు కనిపించినా.. పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చిన డీకేను కాదని సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పటించడంపై చాలా వివాదాలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : తెలంగాణ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా..? కేటీఆర్ సంచలన ట్వీట్

    KTR : కర్ణాటక సీఎం సిద్ద రామయ్యపై కేటీఆర్ చేసిన ట్వీట్...

    karnataka congress: సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం.. హుటా హుటిన బెంగళూర్‌కు వచ్చిన సీనియర్ నేతలు..

    karnataka congress: పదేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన కాంగ్రెస్ పార్టీ...

    BRS Criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు.. ఇదేం వ్యూహమో మరి..

    BRS criticism of Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి...

    Karnataka Formula : తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ కు వర్కౌట్ అవుతుందా..?

    Karnataka Formula : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఈసీ...