34.5 C
India
Monday, May 6, 2024
More

    Supreme comments : విడాకులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రేమ వివాహాల్లోనే విడాకులు ఎక్కువంటూ చెప్పిన న్యాయమూర్తి

    Date:

    Supreme comments
    Supreme comments on divorce

    Supreme comments on divorce is more common in love marriages : ప్రేమ వివాహాం చేసుకున్న వారే విడాకుల ఎక్కువగా తీసుకుంటున్నారని సుప్రీంకోర్ట్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదం విషయంపై ఓ జంట సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసులో ఒకరి తరుపు న్యాయవాది తనది ప్రేమ వివాహం అని ధర్మాసనంకు తెలియజేశాడు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ తో కూడిన ధర్మాసనంలోని జస్టిస్ గవాయ్ స్పందించారు.

    ప్రేమ వివాహం చేసుకున్న వారిలోనే చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నాయిని ఆయన అన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భార్య, భర్తల మధ్య మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదించింది. అయితే దీనికి జంటలోని భర్త అంగీకరించలేదు. అయితే తాజా తీర్పును దృష్టిలో ఉంచుకొని భర్త అనుమతి లేకుండానే విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. అయినా మధ్యవర్తిత్వం చేసుకోవచ్చని సూచించింది.

    సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలను చాలా మంది సమర్ధిస్తున్నారు. ప్రేమించుకునే సమయంలో చాలా మంది భాగస్వామికి అనేక వాగ్దానాలు చేస్తారు. తర్వాత అవి నెరవేరకపోవడంతో ఇద్దరి మధ్యా తేడాలు వచ్చి డైవర్స్ వరకూ వెళ్తుంది. అయితే ఇది పెద్దల చేసిన వివాహం కాదు కాబట్టి వారు కలుగజేసుకునే ఛాన్స్ చాలా వరకు తక్కువ ఒకవేళ కలుగజేసుకుంటే వారి మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ కారణాలతో ప్రేమజంటలు ఎక్కువగా డైవర్స్ తీసుకుంటాయి.

    అదే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో విడాకులు అంతలా ఉండవు. దంపతుల మధ్య ఏదైనా గొడవలు జరిగితే ఇద్దరి తరుపు బంధువులు కూర్చొని సమస్యను సాల్వ్ చేస్తారు. దీంతో దంపతులు కలిసి ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు మాత్రమే గుడ్డిలో మెల్లలా మేలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Divorce : భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

    Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో...

    Wedding Trend Change : పెళ్లిళ్ల ట్రెండ్ మారుతోందా?

    Wedding Trend Change : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే...

    Extramarital Affairs : నయా ట్రెండ్: వివాహేతర సంబంధాలు దేనికి సంకేతం..?

    Extramarital Affairs : ప్రపంచంలో భారత్ భిన్నమైన దేశం. ఇక్కడి సంస్కృతితో...