34.1 C
India
Monday, April 29, 2024
More

    Nara Lokesh : నారా లోకేశ్ కు నొప్పి.. పాదయాత్రకు బ్రేక్ పడుతుందా.?

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : టీడీపీ యువనేత నారా లోకేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న తండ్రి చతురతకు సరిపోయేలా తనను తాను నిరూపించుకోవాలని ఉబలాటపడుతున్నాడు. సమయమున్నప్పుడల్లా అధికార వైసీపీ పై విమర్శనస్ర్తాలు ఎక్కుపెడుతూ పార్టీలో ని యువ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడంలో భాగంగా 400 రోజుల పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే 100 రోజుల పాదయాత్ర ముగిసింది. అన్ని ప్రాంతాల్లో ఈ పాదయాత్రకు మిశ్రమ స్పందన వస్తున్నది..

    వేధిస్తున్న భుజం నొప్పి..

    అయితే యువగళం పాదయాత్రలో ఉన్న నారాలోకేశ్  కుడి భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అక్కడి మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేశ్  కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాడు. 50 రోజులుగా ఈ నొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజవకర్గంలో పాదయాత్ర చేస్తుండగా కార్యకర్తలో తోపులాటలో కుడి భుజానికి గాయమైనట్లుగా భావిస్తున్నారు. అప్పటి నుంచీ నొప్పి ని భరిస్తూనే లోకేశ్ పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు.

    తన ఫిజియోథెరపీ వైద్యుల సూచనలు పాటిస్తున్నా నొప్పి తగ్గడం లేదని తెలిసింది.  దీంతో వైద్యుల సూచన మేరకు నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లో లోకేశ్ కుడి భుజానికి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా దవాఖాన ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు శ్రేణులు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు దవాఖాన పరిసరాల్లో ఏర్పాటు చేయించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం యువనేత లోకేశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Lokesh : ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : నారా లోకేశ్

    Nara Lokesh : ఏపీలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టించడమే తన...

    Nara Lokesh : టీడీపీ అధికాంలోకి రాగానే RMP లకు న్యాయం చేస్తాం.. నారా లోకేష్ 

    Nara Lokesh : యువగళం పాదయాత్రలో ఆర్ఎం పీలు ఎదుర్కొంటున్న సమస్యలను...

    Nara Lokesh : వైసిపి కాలకేయులకు ఇదేనా హెచ్చరిక: నారా లోకేష్

    Nara Lokesh : జగన్ గొడ్డలితో తెగబడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...