34.1 C
India
Monday, April 29, 2024
More

    Telangana Congress : దూకుడు పెంచిన టీ కాంగ్రెస్.. భారీ స్కెచ్ తో ముందుకు..!

    Date:

    Telangana Congress
    Telangana Congress

    Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో జోష్ ను నింపాయి.  తెలంగాణలో కూడా ఈ ఫలితాలే సాధించాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. ఇందుకోసం భారీ స్కెచ్ ను సిద్ధంచేసుకున్నట్లు తెలుస్తు్న్నది. బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న జడ్చర్లలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నది.

    సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు ఇప్పటికే మంచిర్యాలలో ఒక సభను నిర్వహించారు. అయితే జడ్చర్ల సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ హాజరవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ సభకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రియాంక గాంధీ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఎన్నికలకు మరో ఐదు నెలలే గడువు ఉండడంతో, కాంగ్రెస్ వేగం పెంచింది. పార్టీలో చేరికలపై కూడా దృష్టిపెట్టింది. పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ ను వీడిన పొంగులేటి, జూపల్లి తదితర సీనియర్లనుపార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నది. మరోవైపు కాంగ్రెస్సే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని, బీజేపీ నేతలు ఈటల, కొండా తమతో రావాలని రేవంత్ కోరుతున్నారు. సీనియర్లతో కూడా తాను కలిసి పనిచేస్తానని, పార్టీ కోసం పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన ఇటీవల ప్రకటించారు. మరోవైపు మరికొన్ని డిక్లరేషన్లు ప్రకటించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జడ్చర్ల సభ ద్వారా అతి త్వరలోనే సోనియా, రాహుల్ తో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమవుతున్నది.

    Share post:

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్...

    Congress MP Candidates : నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం..

    Congress MP Candidates : లోక్ సభ ఎన్నికల కు కాంగ్రెస్...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...