Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి వరకూ మౌనంగా ఉన్న బీజేపీ నేడు టీడీపీతో పొత్తుకు చర్చలకుసిద్ధమైంది.జనసేన-టీడీపీ కూటమితో చెట్టపట్టాలకు సిద్ధమైందని భావించవచ్చు.ఇక వైసీపీ ఎవరితో పొత్తులేకుండా మొత్తం స్థానాలు మేమే గెలుస్తామని ధీమాగా చెబుతున్నది.ఇక కాంగ్రెస్ అస్థిత్వం కోసం పోరాడుతున్నది.
అందుకే వైఎస్ఆర్ బిడ్డను రంగంలోకి దింపింది.కాంగ్రెస్ అంటేనేబడుగుబలహీనమైనారటీలపార్టీ.కాని కొన్నిపరిస్థితుల నేపథ్యంలో వారి సాంప్రదాయ ఓటును కోల్పోయింది. మళ్లీ ఆ ఓట్లను పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన సీట్లు 34ఉన్నాయి. వాటిలో ఏడు ఎస్టీ,27ఎస్సీలకు కేటాయించారు. వాటిలో అత్యధికం 2019ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. ఏపీలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ నామమాత్రంకూడా లేకపోవడంతో ఆ సాంప్రదాయ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెసుకు బదిలీ అయ్యాయి.
అసలైన కాంగ్రెస్ వైఎస్ఆర్ కుమారుడు జగన్ ఉన్నదనే బలమైన భావన ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కాంగ్రెస్ సారథ్యం చేపట్టి ఇది అసలు కాంగ్రెస్ పార్టీ అని పెద్దగొంతుకతో చెబుతున్నది. కాంగ్రెస్ ను గతంలో లాగా తక్కువ అంచనా వేయలేం.తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయమే అధికారాన్ని ఇచ్చిందని నమ్ముతోంది.
అలాగే ఏపీలో అధికార పార్టీని షర్మిలారెడ్డీ అన్నిరకాలుగా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతోపాటు ఎస్సీఎస్టీలఓట్లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా 11వ తేదీన కడపలో దళిత సింహగర్జన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నున్నది. కాంగ్రెస్ బలపడి వైసీపీ ఓటుబ్యాంక్ కు చిల్లుపెట్టే వ్వూహంరచిస్తోంది.ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలకపోగా టీడీపీ కూటమికి లాభం చేయడమేకాక తన అస్థిత్వం కూడా నిలుపుకొనే పనిలో పడింది.
ఈసారి ఏలాగైనా సాంప్రదాయ ఓట్లను తిరిగి తమవైపు తిప్పుకోవాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నది. అలాగే తెలంగాణ సరిహద్దు నియోజకవర్గాలు ఉన్న కర్నూలుజిల్లాలో,కర్ణాటక సరిహద్దు జిల్లాలైన రాయదుర్గం,కల్యాణ దుర్గం నియోజకవర్గాలపైన దృష్టి పెట్టింది. వైఎస్ఆర్ బిడ్డగా ప్రజల నాడి తెలిసిన షర్మిల ఈ పోరాటంలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇవ్వడమేకాక భవిష్యత్ లో పూర్వవైభవం తెస్తుందని ఆపార్టీ అధిష్టానం,క్యాడర్ నమ్మతోంది.
(యం.వి.రామారావు,సీనియర్ జర్నలిస్టు)