36.9 C
India
Sunday, May 5, 2024
More

    Avinash bail : మరికాసేపట్లో అవినాష్ బెయిల్ పై నిర్ణయం.. ఏం జరగబోతుంది..?

    Date:

    Avinash bail
    Avinash bail

    Avinash bail : కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మరి కాసేపట్టో నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ శ్రేణులు, ఏపీ ప్రజల దృష్టంతా అటు వైపే పడింది. మరోవైపు బెయిల్ ఇవ్వకుంటే అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటున్నది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా పేర్కొంటూ విచారిస్తున్నది. అయితే ఇటీవల విచారణకు పిలిచిన మూడు సార్లు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిని సీబీఐ సీరియస్ గా  తీసుకుంది.

    అవినాష్ రెడ్డి తల్లి గుండె సంబంధిత ఇబ్బందితో దవాఖానలో చేరింది. ఆమెకు తోడుగా అవినాష్ అక్కడే ఉంటున్నారు. ఇదే కారణంతో విచారణకు కూడా రావడం లేదు.  అయితే ప్రస్తుతం దవాఖాన వద్ద ఉద్రిక్త పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు అవినాష్ కు బెయిల్ ఇవ్వవద్దంటూ వైఎస్ వివేకా కూతురు సునీత ఇందులో ఇంప్లీడ్ అవుతున్నట్లు సమాచారం. ఆమె తరపున న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకు చేరుకున్నట్లు తెలిసింది.

    అయితే హైకోర్టు బెయిల్ ఇస్తే ఇది అవినాష్ రెడ్డికి పెద్ద ఊరటలాగే భావించవచ్చు. ఒకవేళ పిటిషన్ ను తిరస్కరిస్తే ఇక అవినాష్ అరెస్ట్ ఖాయమవుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  మరి ఈ సాయంత్రం ఈ అంశంపై సీబీఐ ముందుకెళ్తుందా.. లేదంటే హైకోర్టు తీర్పుతో ఆగిపోతుందా తేలనుంది.

    అయితే రెండు రోజుల క్రితమే అవినాష్ అరెస్ట్ కు సంబంధించి సీబీఐ ముందుకెళ్లింది. కర్నూల్ ఎస్పీకి సమాచారం అందజేసింది. కానీ కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనుకడుగు వేసినట్లు సమాచారం. మరోవైపు కర్నూల్ పోలీసులు కూడా సహకరించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    CM Revanth : ‘కాళేశ్వరం’లో అవినీతిపై రేవంత్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?

    CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు...

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...

    Deadline in Viveka’s murder case : వివేకా హత్య కేసులో ముగిసిన గడువు.. సీబీఐ తేల్చిందేమిటో..?

    Deadline in Viveka's murder case : కడపలో వైఎస్ వివేకానందరెడ్డి...