38.3 C
India
Sunday, May 5, 2024
More

    YS Viveka murder : వివేకా హత్య జగన్ కు ముందే తెలుసా.. సీబీఐ ఏం చెప్పింది..?

    Date:

    YS Viveka murder
    YS Viveka murder case

    YS Viveka murder : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన అనుబంధ కౌంటర్ లో సీబీఐ కీలక విషయాలను ప్రస్తావించింది. వివేకా మృతి విషయం సీఎం జగన్ కు ఉదయం 6 గంటలకు ముందే  తెలుసునని దర్యాప్తులో తేలిందని చెప్పింది. జగన్ కు పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే హత్య విషయం తెలుసునని, అయితే చెప్పింది అవినాషేనని తమకు కొన్ని అనుమానాలున్నాయని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లింది.

    హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ వాట్సాప్ కాల్స్ మాట్లాడారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు సహకరించడం లేదని కౌంటర్లో పేర్కొంది. జూన్ 30లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అవినాష్ కు బెయిల్ ఇవ్వద్దని చెప్పింది. అయితే సునీత, అవినాష్ న్యాయవాదుల వాదనలు విన్న బెంచ్, విచారణను శనివారానికి వాయిదా వేసింది. మరోవైపు సీబీఐ వాదనలను కూడా పూర్తిస్థాయిలో వినాల్సి ఉంది.

    జగన్ పేరు చేర్చడంపై న్యాయవాదుల అభ్యంతరం..

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్ కు ముందే తెలుసునని సీబీఐ పేర్కొనడంపై జగన్ తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్లాలని యోచిస్తున్నారు. మరోవైపు సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పేరు చేర్చడం దారుణమని పేర్కొన్నారు. సడన్ గా జగన్ పేరు చేర్చడం చిల్లర చేష్టగా అభివర్ణించారు. మరి శనివారం సీబీఐ వినిపించే వాదనల్లో మరెన్ని అంశాలు బయటకు రానున్నాయో తెలియనుంది.

    అయితే అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇక మునిగిపోయినట్లేనని, ఏపీ సీఎం జగన్ పాత్రపై కూడా తమకు ముందు నుంచే అనుమానాలున్నాయని  టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏదేమైనా నిస్పక్షపాతం సీబీఐ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నదని కొనియాడుతున్నారు.  ఒత్తిళ్లు వచ్చినా సీబీఐ అధికారులు ముందుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....