37.3 C
India
Thursday, May 9, 2024
More

    Raadhika Sarathkumar : రాధిక శరత్ కుమార్ ఆస్తులు ఎంతో తెలుసా.. మీరు షాక్ అవుతారు..! 

    Date:

    Radhika Sarath Kumar
    Raadhika Sarathkumar

    Raadhika Sarathkumar : దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలవడంతో పలుచోట్ల అభ్యర్థులు నామినే షన్ లు పత్రాలను సమర్పిస్తున్నారు.

    తమిళనాడు లోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా  అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్‌  సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా ప్రకటించారు.

    రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామి నేషన్ లో పేర్కొన్నారు. రూ.26.40కోట్ల స్థిరాస్తు లతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

    ఇటీవల రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌  తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి ని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విరుదునగర్‌ నుంచి కాషాయ పార్టీ ఆమెను నిలబెట్టింది.  ఈ స్థానానికి తొలి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

    Share post:

    More like this
    Related

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...