బ్రేకింగ్ న్యూస్ …… చార్మినార్ కు బాంబు బెదిరింపు వచ్చింది. చార్మినార్ ను బాంబులుతో పేల్చి వేస్తున్నామని , లోపల బాంబులు పెట్టామని ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని షాపుల వాళ్ళను వెల్లగొట్టారు. చార్మినార్ చుట్టూ వేల సంఖ్యలో ఫుట్ పాత్ షాపులు ఉన్న విషయం తెలిసిందే. ప్రజలను దూరంగా పంపించి బాంబ్ స్క్వాడ్ తో చార్మినార్ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. చార్మినార్ చారిత్రాత్మక కట్టడం కావడంతో ప్రతీ రోజు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుంటారన్న విషయం విదితమే. బాంబ్ బెదిరింపు కాల్ తో చార్మినార్ ప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది.
Breaking News