ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. గత కొంత కాలంగా కమలం పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఇరత పార్టీల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జనసేనలోకి మారుతారని అనుకున్నారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ గురువారం ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీలోకి ఎప్పుడు జాయిన్ అవ్వాలనే తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. ఈనెల 23 లేదా 24న ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు.
నిన్నటి వరకు బీజేపీలో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. 1989నుంచి 2004 వరకు ఆయన పార్టీ తరుపున పెదకురపాటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ క్రమంలో 1991-1994 కాలంలో మొదటిసారి కేబినెట్ లోకి అడుగుపెట్టి క్రీడలు, యువజన సర్వీసుల ఖాఖ మంత్రిగా పనిచేశారు. నియెజయవర్గాలు పునర్విభజనలో భాగంగా 2009లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2014 అక్టోబర్ 27న న్యూఢిల్లీలో బీజేపీ లో చేరారు. 2019 ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు అయిన తరువాత కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అమరావతి రైతుల ఉద్యమ సమయంలో సోము వీర్రాజు చంద్రబాబును విమర్శిస్తుంటే కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మద్దతు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే పార్టీ మారుతారన్న ప్రచారం సాగింది. అయితే కొన్ని రోజుల కిందట జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో సమావేశం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయన జనసేన పార్టీలోకి మారుతారని అనుకున్నారు.
కానీ ఆయన అనూహ్యంగా టీడీపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి💐 ఇస్తానన్న హామీతోనే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే గురువారం నిర్వహించిన సమావేశం తరువాత అసలు విషయం బయటకు వస్తుందని అంటున్నారు. బీజేపీలో నామినేటెడ్ పోస్టు ఆశించిన ఆయనను పక్కన బెట్టడంతో అసంతృప్తికి లోనైట్లు సమాచారం.