Hyderabad : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీ లో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యాజమానిపై కత్తితో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితు డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీ సులు,క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యా ప్తు చేస్తు న్నారు. దుకాణంలో ఎంత బంగారం చోరీకి గురైందనే వివరాలు తెలియాల్సి ఉంది.