40.3 C
India
Monday, May 6, 2024
More

    Flying Taxi : గాలిలో ఎగిరే ట్యాక్సీ త్వరలో మీముందుకు రాబోతుంది?

    Date:

     

     

    హైదరాబాద్:   అటవీ ప్రాతంలో నివాసం ఉంటే వారి ప్రాణాలకు సాధారనంగా గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి సౌకర్యాలు ప్రజలు ఉండవు. కనీసం ఏదైనా ప్రాణాపాయ స్థతి వస్తే అడవి నుంచి ఆసుపత్రికి రావాలి అంటే కనీసం రోడ్డు మార్గం కూడా ఉండదు. దీంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయేవారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరగకుండా ఉంటాలి అంటే మన ప్రాంతానికి ఎయిర్ ట్సాక్సీ రావాలి. ఇంతరు ఎయిర్ ట్యాక్సి ఏంటి అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరి చూడండి మీకే అర్థం అవుతుంది.

    ‘రెండేరెండు గంటల్లో హైదరాబాద్‌ నుంచి అటవీ ప్రాంతమైన ములుగుకు ఎయిర్‌ ట్యాక్సీలో గుండెను తీసుకెళ్లి రోగి ప్రాణాలు కాపాడొచ్చు’’. ‘‘తొమ్మిది గంటల్లో ఆదిలాబాద్‌ నుంచి తిరుపతికి ఎంచక్కా ఎగురుతూ వెళ్లిపోవచ్చు’’.అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే 2025లోనే ఇవన్నీ నిజమవుతాయి. జపాన్‌కు చెందిన ఫ్లయింగ్‌ కార్ల తయారీ సంస్థ స్కై డ్రైవ్‌ పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. మనదేశంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ తయారీ సంస్థ మారుత్‌ డ్రోన్స్‌తో ఒప్పందం చేసుకుంది.

    భూమి ఉపరితలం నుంచి 5 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించడం ఎయిర్‌ ట్యాక్సీల ప్రత్యేకత. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతోపాటు కొండ ప్రాంతాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను తీసుకెళ్లడమే లక్ష్యమని మారుత్‌డ్రోన్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ విస్లావత్‌ మీడియాకి తెలిపారు. ఎయిర్‌ ట్యాక్సీ ప్రత్యేకతలు ఆయన మాటల్లోనే..వాయు రవాణారంగంలో సరికొత్త శకం మొదలుకానుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఈ–కామర్స్‌ వృద్ధి వంటి కారణంగా ప్రజలు, వస్తువులకు వేగవంతమైన, సురక్షితమైన, సరసమైన రవాణావిధానం అవసరం. దీనికి అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ (యూఏఎం) పరిష్కారం చూపిస్తుంది. 2030 నాటికి యూఏఎం ఎయిర్‌క్రాఫ్ట్‌ మార్కెట్‌ దాదాపు 25–30 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని పరిశ్రమవర్గాల అంచనా.

    ఎయిర్‌ ట్యాక్సీ అంటే..
    ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ మరియు ల్యాండింగ్‌ (ఈవీటీఓఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌ ట్యాక్సీలని పిలుస్తారు. ఇవి ఎలక్ర్టిక్‌ బైక్‌లు, కార్ల లాగా బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి హెలికాప్టర్‌ ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సామర్థ్యంతో మిళితమై ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని ఈ ఎయిర్‌ ట్యాక్సీలతో ట్రాఫిక్‌ రద్దీ, రణగొణ ధ్వనుల వంటి సమస్యలు ఉండవు.

    రాజేంద్రనగర్‌లో టెస్టింగ్‌ సెంటర్‌
    ఎయిర్‌ ట్యాక్సీలను స్కైడ్రైవ్‌ జపాన్‌లో తయారు చేస్తుంది. పరిశోధనలు, అనుమతులు పూర్త­య్యాక.. విడిభాగాలను ఇండియాకు తీసుకొచ్చి హైదరాబా­ద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టెస్టింగ్‌ సెంటర్‌లో బిగిస్తామని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. భవిష్యత్‌ అవసరాలకు సెంటర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...