
Jagan illegal assets case : ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు ప్రస్తుతం ఊసే లేకుండా పోయింది. గతంలో సీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో అత్యంత ఊపు మీద కొనసాగిన విచారణ, ఆయన బదిలీ అయ్యాక ఇక మూలన పడిపోయింది. అక్రమాస్తుల కేసులో జగన్ కొంత కాలం శిక్ష కూడా అనుభవించారు. ఇక అప్పటినుంచి బెయిల్ పై బయట ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా కేసుపై చర్చ కూడా లేదు
ప్రజా ప్రతినిధులపై కేసులను ఏడాదిలో తేల్చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా ఇప్పుడు అది ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏళ్లకు ఏళ్లుగా బయటే ఉంటున్నాడు. అయితే జగన్ సీఎం కాబట్టి అవకాశం ఇచ్చారు. మరి సామాన్యుడికి కూడా ఇలాంటి అవకాశం సీబీఐ ఇస్తుందా అనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు అవకాశమే లేదని చట్టం అందరికీ ఒకేలా ఉండదని అంటున్నారు.జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ, ఈడీ ఇప్పటివరకు కనీసం ట్రయల్ వరకు కూడా తీసుకురాలేదు. తండ్రి హయాంలో ప్రభుత్వం ఆస్తులను అప్పనంగా కేటాయించి, లబ్ధి పొందారని జగన్ పై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈ దర్యాప్తు సంస్థలు తేల్చకపోయాయి. అసలు జగన్ తప్పు చేశాడా.. లేకుంటే ఇవి ఆరోపణలా అని కూడా తేల్చకపోయాయి.
అయితే ఏపీ సీఎంగా జగన్ అధికారంలో కి వచ్చాక విచారణ పక్కదారి పట్టింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలా.. లేకుంటే మరే ఇతర కారణాలా తెలియదు కాని విచారణ ఊసే లేకుండా పోయింది. ఆయన కోర్టుల విచారణకు కూడా హాజరు కావడం లేదు. దీనిపై అటు దర్యాప్తు సంస్థలు కాని ఇటు న్యాయ వ్యవస్థ కాని స్పందించడం లేదు. అయితే ఇలాంటి వే సామాన్యుల్లో ఇలాంటి వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజా సొమ్మును దుర్వినయోగం చేసే రాజకీయ నాయకుల పై కేసులను వెంటవెంటనే తేల్చి శిక్షలు ఖరారు చేస్తే మరొకరు తప్పు చేయడానికి ఆస్కారం ఉండదని, చట్టాల్లో లొసగులు తెలిసిన ప్రతి ఒక్కరూ ఇలా కుబేరులు మారి అధికారాన్ని చెలాయిస్తారని అంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి టీడీపీ కూడా ఇటీవల ఈ అక్రమాస్తుల కేసుల జోలి ఎత్తకపోవడం విశేషం.