బీజేపీ టార్గెట్ నేను కాదు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఈడీ నోటీసులు పంపించడం పట్ల స్పందించింది. సీబీఐ ఇంతకుముందు 6 గంటల పాటు విచారిస్తే అన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఈడీకి కూడా తెలిసింది చెబుతాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అరుణ్ రామచంద్ర పిళ్ళై నాకు స్నేహితుడే కానీ అతడు చేసే వ్యాపారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండబద్దలు కొట్టింది కవిత.
అసలు బీజేపీ టార్గెట్ నేను కాదు కేసీఆర్. మోడీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తోంది కేసీఆర్ దాంతో ఆయన్ని నిలువరించడానికి నన్ను అందులో పావుగా వాడుకుంటున్నారు అంటూ బీజేపీ పై సంచలన ఆరోపణలు చేసింది కవిత. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి ….. జైల్లో పెట్టుకోమనండి ….. అల్టిమేట్ గా నేను ప్రజల వద్దకే వెళ్తాను న్యాయం కోసం అంటూ సమాధానమిచ్చింది కవిత.