29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Telugu Pride NTR : తెలుగు వారంతా గర్వపడే అరుదైన ఘట్టం, తెలుగువాడు ఉన్నంత వ‌ర‌కూ.. !

    Date:

    Telugu Pride NTR
    Telugu Pride NTR

    Telugu Pride NTR  : న్యూయార్క్ టైం స్క్వైర్.. అమెరికాలోని ఈ ప్రాంతం ఎన్నో పోరాటాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రం. ప్రజల బాధ అయినా.. సంబరాలు అయినా ఇక్కడే ప్రదర్శిస్తారు. ఇక్కడ ప్రదర్శిస్తే అది అమెరికన్ల అందరి మనోభావాలకు ప్రతీక. అలాంటి చోట మన తెలుగోటి వైభవం ఎగిరింది. మన ఎన్టీఆర్ నిలువెత్త విగ్రహం ఠీవీగా నిలబడింది. ఇది తెలుగు వారికి దక్కిన గౌరవంగా చెప్పొచ్చు.

    అసలు ఎన్టీఆర్ అంటేనే తెలుగు వెలుగు. అప్పటి వరకూ మద్రాసి అన్న ముద్రను చెరిపేసి అనాదిగా కుట్రలు, కుంభకోణాలతో సాగుతున్న కాంగ్రెస్ ను ఓడించి తెలుగు నాట 9 నెలల్లోనే అధికారం సంపాదించిన మన గొప్ప నేత, కళాకారుడు ఎన్టీఆర్. సినిమాల్లో అన్నేళ్లు చేసి నటసార్వభౌముడిగా ఎదిగి టాలీవుడ్ లోనే నంబర్ 1 స్థాయికి చేరుకున్నారు. అనంతరం ప్రజా సేవ కోసం తపించి రాజకీయాల్లోకి వచ్చారు.

    రాజకీయాల్లోనూ రూ.2లకే కిలో బియ్యం, పట్వారీ పటేల్ వ్యవస్థ రద్దు సహా మండలాలు ప్రవేశపెట్టి ఎన్నో గొప్ప సంస్కరణలు చేసి పేదల కష్టాలు తీర్చి దేవుడిగా నిలిచాడు. అలాంటి ఎన్టీఆర్ శతజయంతిని తెలుగు ప్రజలే కాదు.. అమెరికాలోని ప్రవాసులు ఘనంగా చేస్తున్నారు.

    అందుకే తాజాగా అమెరికాలోని ప్రతిష్టాత్మక న్యూయార్క్ టైం స్క్కైర్ వద్ద ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్ ను ఆవిష్కరించారు. ప్రతి తెలుగువాడు ఉప్పొంగేలా తీర్చిదిద్దారు. ఇది అమెరికాలో తెలుగువాళ్లకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పొచ్చు.

    న్యూయార్క్ టైంస్క్వేర్ పైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి విజయ దరహాసం చూపరులను ఆకట్టుకుంటోంది.. మొట్టమొదటి సారిగా 200 అడుగులు ఎత్తు, 36 అడుగులు వెడ‌ల్పుతో తెలుగు వ్యక్తికి న్యూయార్క్ టైంస్క్వేర్ పైన దక్కుతున్న అరుదైన గౌరవంగా దీన్ని చెప్పొచ్చు..

    అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న‌ ఎన్టీఆర్’ చిత్రమాలిక న్యూయార్క్ టైం స్క్వైర్ వద్ద తళుకులీననుంది.  శకపురుషునికి NRI TDP USA అందిస్తున్న శతజయంతి నీరాజనంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Padma Bhushan : ఎన్టీఆర్ వారసుడి గర్వకారణం: పద్మ భూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ

    Padma Bhushan Bala Krishna : తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర...

    Sr. NTR : మరణం లేని జననం ఎన్టీఆర్.. ఘనంగా నివాళులర్పించిన పురంధేశ్వరి, పాతూరి నాగభూషణం

    Sr. NTR Vardhanthi : ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహంకి...

    NTR is emotion : ఎన్టీఆర్ అంటే ఏమోషన్.. ఈ ఫొటోనే సాక్ష్యం

    NTR is emotion : ఎన్టీఆర్ అంటే ఏమోషన్.. ఎన్టీఆర్ అంటే ఓ...