ఏపి: కడప జిల్లా లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వైఎస్ షర్మిల హాజరు అయ్యారు. మార్క్ రాజకీయాలకు YSR కేరాఫ్ అడ్రస్ అని వైఎస్ షర్మి ల అన్నారు. ఆయన పథకాలే ఒక మార్క్ అని రాష్ట్రంలో రోజుకో జోకర్ ను తీసుకువచ్చిన నాపై నింద లు వేపిస్తున్నారని వైసిపినేతలను ఉద్దేశించి షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. సాక్షి సంస్థలో నాకు సగ భా గం ఉందని ఆమె తెలిపారు. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి నేనని నాన్న రక్తమే నాలో ఉందని పులి కడుపున పులే పుడుతుందని ఆమె అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు అని ఇక్కడ ప్రజ లకు సేవ చేయడానికే వచ్చానన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి..ఎలా నిందలు వేస్తారో వేయండి అంటూ వైఎస్ షర్మిల ఘూటుగా స్పందించారు..
ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఈ కడప బిడ్డ. పులివెందుల పులి అని ఆమె అన్నారు. తెల్లని పంచే కట్టు,మొహం నిండా చిరునవ్వు ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర వేసుకు న్నారని ఆమె తెలిపారు. వైఎస్సార్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించాడ న్నారు. వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదని పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారన్నా రు. 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారని 46 లక్షల పేదలకు పక్కా ఇండ్లు కట్ట డం వైఎస్సార్ మార్క్ అన్నారు.
మోడీ తో దోస్తీ చేసే మీరు ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేక పోయారని ఆమె ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మత్తులు లేవన్నారు. రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదని వైఎస్సార్ తన జీవితంలో బీజేపీ నీ ఎప్పటికీ వ్యతిరేకించారన్నారు. అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ ఆన్న నిలబెడుతున్నరా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ మైనారి టీలను ప్రేమించే వారని రైతును రాజు చేయడం వైఎస్సార్ మార్క్ అన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడ నుంచి కదల ..పోలవరం వచ్చే వరకు కదలను ఏం పీక్కుంటారో.. పీక్కోండి అని షర్మిల ఘూటుగా స్పందించారు.