
Trouble shooter : అఖండ విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని ఖారారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ ష్యూటర్ గా గుర్తింపు సంపాదించుకున్న డీకే శివకుమార్ ను పార్టీ అధిష్టానం ఎందుకు పక్కనపెట్టిందన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇంత కష్టపడి భారీ మెజారిటీ కారణమైన డీకేకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న ప్రశ్న ఇప్పుడు కన్నడిగుల మెదలుతుంది. సిద్ధ రామయ్యను ఎందుకు సీఎం చేసింది అదిష్టానం. ఏ అంశాలు ఆయనకు అనుకూలించాయి. డీకే ఎందులో వెనుకబడ్డాడో ఇక్కడ తెలుసుకుందాం.
డీకే ఊరికే ట్రబుల్ ష్యూటర్ కాలేదు. ఆయన ఏదైనా పని చేయాలని అనుకుంటే పూర్తి చేసే వరకూ వదలడు. అందుకే ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. ఇది అధిష్టానానికి ఆందోళన కలిగించింది. ఈ కేసుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఆయనను ఎప్పుడైనా జైలుకు పంపవచ్చు. ఆ పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల ప్రచారంలో తాను సీఎం కుర్చీపై కూర్చుకునేందుకు ఆశతో ఉన్నానని చెప్తూనే.. తను చాలా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశాడు.
సిద్ధరామయ్య ఓబీసీ వర్గానికి చెందిన వారు..
సిద్ధరామయ్య దళితులు, ముస్లింలు, వెనుకబడిన తరగతులపై ప్రభావం చూపే వ్యక్తి. ఆయనను సీఎం చేయకుంటే పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతుంది. దళిత, మైనార్టీ, గిరిజన, నఓబీసీ సమాజంలో ఆయనకు భారీగా క్రేజ్ ఉంది. పైగా సిద్ధరామయ్య కూడా OBC కులానికి చెందినవాడు కావడం కూడా ఆయన సీఎం అయ్యేందుకు కలిసివచ్చింది.
సిద్ధరామయ్య చాలా కాలంగా అమంగళితరు, హిందూలిద్వారు, దళితారు ఫార్ములాపై పని చేస్తున్నారు. అహిందా సమీకకరణం కింద సిద్ధరామయ్య ప్రధానంగా దృష్టి పెట్టారు. అహిందా వర్గం వారు జనాభాలో 61 శాతం మంది ఉన్నారు. కర్ణాటకలో దళితులు, ముస్లింలు, గిరిజనుల జనాభా 39 శాతం ఉంది. సిద్ధరామయ్య కుర్భ కులస్తులు కూడాదాదాపు 7 శాతం ఉన్నారు. 2009 నుంచి ఈ వర్గాల సమీకరణలతో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగా ప్రవేశించింది.
మరికొన్ని పాయింట్లు..
సిద్దరామయ్య ఓబీసీ కావడం పైగా ఆయనకు వారి మద్దతు కూడా ఉంది. ఇక శివకుమార్ అగ్రకుల నాయకుడు. డీకే సీఎం అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడవచ్చు.
వయస్సు, అనుభవం దృష్ట్యా సిద్ధరామయ్యే ముందున్నాడు. శివకుమార్ కు సీఎం పదవిపై అనుభవం లేదు.
పార్టీ కేడర్ లో సిద్ధ రామయ్యకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయనతో పోల్చితే డీకేకు తక్కువనే చెప్పాలి.
సిద్ధరామయ్యుకు క్లీన్ ఇమేజ్ ఉంది.. పార్టీ పరంగా అయినా.. వ్యక్తిగతంగా అయినా ఇక డీకేపై కేసులు ఉన్నాయి.
వయస్సు రీత్యా ఈ సారి ఆఖరుసారి సీఎం పదవి ఇవ్వాలంటూ సిద్దరామయ్య సెంటిమెంట్ అస్త్రం సంధించారు.
రాహుల్ గాంధీకి కూడా సిద్ధరామయ్య అంటే చాలా ఇష్టం. ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరై పదే పదే ప్రశంసించారు రాహుల్ గాంధీ. రాహుల్ దృష్టిలో శివకుమార్ ఎప్పుడూ సెకండే.
సీఎంగా సిద్ధరామయ్య సక్సెస్ అయ్యడు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంటుంది.