Crime News : వివాహ, వివాహేతర రెండక్షరాల తేడానే అయినా రెండు జీవితాలు, రెండు కుటుంబాల పరువు మర్యాదతో కూడుకున్న అంశం. సుప్రీం వివాహేతర సంబంధంపై నమోదు చేసే కేసును తొలగించినప్పటి నుంచి ఇటు మగవారు.. ఆడవారు రెచ్చిపోతున్నారని సమాజంలో టాక్ వినిపిస్తుంది. అయితే, ఇది సమాజ పతనానికి దారి తీస్తుందని చాలా మంది సంఘ ప్రేమికులు, సమాజవాదులు అభిప్రాయ పడుతున్నారు.
వివాహేతర సంబంధాలు ఎవరో ఒకరిని చావు వరకు తీసుకెళ్తాయి. ఇద్దరి సమ్మతమే ఉన్నా.. సమాజ హితం కాదు.. వ్యక్తిగత పరువుతో పాటు కుటుంబ పరువు కూడా పోతుందని భావిస్తూ కొందరు హత్యల వరకు తీసుకెళ్తారు. అయితే, ఈ వివాహేతర సంబంధంలో ముఖ్యంగా మహిళ తరుఫు వారు హత్యలకు ఒడిగడతారు. మాయ మాటలు చెప్పి మహిళను లోబర్చుకున్నారని మండి పడతారు. ఇలాంటి ఒక ఘటనే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగింది.
కృష్ణానగర్ పరిధిలోని ఎల్ఎన్ నగర్ కు చెందిన రాము ఎలియాస్ సింగోటం రామన్న (30 సంవత్సరాలు) అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ తరుఫున వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్ లో దాడి చేశారు. కత్తులతో పొడిచి, అతని మర్మాంగాలను కోసి వేశారు.
అతని అరుపులు కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే వీరు వచ్చేలోగా నిందితులు హత్యా ప్రదేశం నుంచి పారిపోయారు. కేసును దర్యాప్తు చేస్తూ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసుల తెలిపారు.