
15th September Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనులు త్వరగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. దైవానుగ్రహంతో పనుల్లో వేగం పెరుగుతుంది. గురువును ఆరాధిస్తే మంచిది.
వ్రషభ రాశి వారికి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు. వ్యతిరేకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. మహావిష్ణువును ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. బుద్ధిబలం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉటుంది. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి అనుకూల కాలం. ముఖ్యమైన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. సమయానికి సాయం చేసే వారుంటారు. లక్ష్మీధ్యాన చేయడం వల్ల మంచిది.
సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. దైవారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కన్య రాశి వారికి సమస్యలు పెరగకుడా చూసుకోవాలి. డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి వారికి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోతే సమస్యలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
వ్రశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతను ఆరాధన చేయడం శుభకరం.
ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. అధికారుల ప్రశంసలు దక్కుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. అందరితో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవత ఆరాధన మంచి ఫలితాలు రావడానికి వీలవుతుంది.
కుంభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. కొత్త పనులు చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దుర్గా ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మీన రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. దుర్గాధ్యానం చేయడం శుభకరం.