21st September Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి. ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన చేయడం చాలా మంచిది.
వ్రషభ రాశి వారికి అనుకూల కాలం ఉంటుంది. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. శివుడిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి మీకు శత్రువులు పెరుగుతారు. చేసే పనులు శ్రద్ధగా చేయండి. మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాు. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి నచ్చిన వారితో సంతోషంగా ఉంటారు. పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నారాయణ మంత్రం చదవడం శుభకరం.
సింహ రాశి వారికి పనులు శ్రద్ధగా చేసుకుంటే విజయం సిద్ధిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలుంటాయి.
కన్య రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. వెంకటేశ్వర నామస్మరణ మంచి చేస్తుంది.
తుల రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. విభేదాలు రాకుడా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేపట్టే పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. వాగ్వాదాలకు దిగకండి. శని శ్లోకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.
మకర రాశి వారికి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో వేగం ఉంటుంది. సూర్యుడిని పూజించడం శుభకరం.
కుంభ రాశి వారికి మంచి కాలం. ఉల్లాసంగా గడుపుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పనుల్లో వేగం పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన మంచి చేస్తుంది.
మీన రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనో ధైర్యం పెరుగుతుంది. వాగ్వాదాలకు దిగడం మంచిది కాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మేలు చేస్తుంది.