Shaarika Matangi Pooja : భక్తులు ఆరాధించే రూపం ఏదైనా అమ్మవారు మాత్రం సర్వ వ్యాపకం. పోచమ్మలోనూ, దుర్గమ్మలోనూ, గౌరమ్మలోనూ ఆఖరికి అమ్మలోనూ అమ్మ వారు కొలువై ఉంటుంది. ఆయా సంస్కృతులు, సంప్రదాయాలు, పద్ధతులను బట్టి మారుతాయే తప్ప అమ్మవారు మాత్రం ఒక్కరే. మహా విద్యలలో ఒకరు, 10 మంది తాంత్రిక దేవతలు హిందూ దైవిక తల్లి అంశం. ఆమె సంగీతం, అభ్యాసానికి దేవత అయిన సరస్వతి యొక్క తాంత్రిక రూపమే మాతంగి.
మాతంగి అమ్మవారు జ్ఞనాన్ని ఇచ్చే సరస్వతి లాగానే వాక్కు, సంగీతం, జ్ఞానం, కళలను ఇస్తుంది. అతీంద్రియ శక్తులను పొందడం, ముఖ్యంగా శత్రువులపై పట్టు సాధించడం, ప్రజలను తనవైపు ఆకర్షించడం, కళలపై పట్టు సాధించడం అత్యున్నత జ్ఞానాన్ని పొందడం కోసం మాతంగి అమ్మవారిని ఆరాధిస్తారు.
మాతంగి అవతారం..
కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు లాంటి మహా కవులు మాతంగి అమ్మవారిని ఉపాసన చేశారు. గిరిజన ఆవాసాలలో మతంగ మహర్షి ఉండేవాడు. ఆ మంతగ మహర్షి శిష్యురాలు శబరి (రాముడికి ఆతిథ్యం ఇచ్చిన భక్తురాలు). ఆ గిరిజనులు ఆరాధించేందుకు ఒక రూపం కావాలని నుకున్న మతంగ మహర్షి అమ్మవారిని గిరిజన గూడాల్లోకి రమ్మని పిలిచాడు. అమ్మవారు మతంగ మహర్షి భక్తిని మెచ్చి గిరిజనుల కోసం గూడాల్లోకి వచ్చింది. ఇక మాతంగి అనే పేరు ఎలా వచ్చిందంటే మతంగ మహర్షి కుమార్తెగా అమ్మవారు వచ్చింది కాబట్టి మాతంగి అనే పేరు వచ్చింది.
అమెరికాలోని న్యూజెర్సీ పరిధిలో ఉన్న శ్రీసాయి దత్తపీఠం, శ్రీ శివ వైష్ణవ దేవాలయం ఆవరణలో మాతంగి అమ్మవారి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బుధవారం వసంత పంచమి కావట్టి ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand
More Images : 7th Day Shaarika Matangi Pooja at SDP SSV Temple