22.8 C
India
Sunday, August 9, 2026
More

    Crime : ప్రియురాలిని చంపి మ్యాన్ హోల్ లో పడేసి.. ప్రియుడి దారుణం..

    Date:

     

    A boy was killed his girlfriend : వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. తొందరపాటులో ఒకరి హత్య, మరొకరి జైలు జీవితం ఇద్దరూ ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధంలో ఉన్న యువతి తనను పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను చంపాడు ప్రియుడు. పైగా సదరు యువతి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హత్య తతంగం వెలుగు చూసింది.

    హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన పూజారి వెంకటసాయి కృష్ణ. అప్సర అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి కారణమైంది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర వెంకటసాయి కృష్ణపై ఒత్తిడి తెస్తుంది. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది. అయితే తనకు పెళ్లి జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని వెంకట సాయి కృష్ణ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. అయనా పర్వాలేదు అంటూనే అప్సర మరింత ఒత్తిడి పెంచింది. ఇక లాభం లేదని, తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పట్టు బట్టింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని వెంకట సాయి కృష్ణ నిర్ణయించుకున్నాడు.

    హత్యకు పథకం వేశాడు. ఎలాగో ఒకలా అప్సరను నమ్మించి 3వ తేదీన కారులో సుల్తాన్‌పల్లికి తీసుకెళ్లాడు. ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత మృత దేహాన్ని సంచిలో వేసి కుట్టేసి, స్థానికంగా ఉన్న మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వెంకటసాయి అప్సరను చంపాడని  ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులను తమదైన స్టయిల్ లో విచారణ చేపట్టగా, నేరం ఒప్పుకున్నాడు వెంకటసాయి. అప్సర మృతదేహాన్ని ఏ మ్యాన్ హోల్ లో వేశాడో కూడా చూపించాడు.

    ప్రస్తుతం అప్సర మృతదేహం కోసం అధికారులు శ్రమిస్తున్నారు. ఈ విషయంపై ఆమె తల్లితో మాట్లాడగా తన కూతురు కనిపించకపోవడంతో వెంకటసాయి కృష్ణను అడిగానని ఆమె కోయంబత్తూర్ కు వెళ్లిందని చెప్పాడని వివరించింది. ఈ మర్డర్ తో వెంకటసాయి కృష్ణకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    30 మంది చిన్నారులను చంపిక నేరస్తుడికి జీవిత ఖైదు..

    Life imprisonment : తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో...