39.2 C
India
Thursday, June 1, 2023
More

    30 మంది చిన్నారులను చంపిక నేరస్తుడికి జీవిత ఖైదు..

    Date:

    Life imprisonment
    Life imprisonment : తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో తెలియదు. అభం,  శుభం తెలియని చిన్నారులను ఎత్తుకెళ్లి వారితో లైంగిక వాంఛ తీర్చుకొని ప్రాణాలు తీస్తుంది. ఈ దుర్మార్గుడు 30 మంది చిన్నారులను చంపాడు. మత్తులో ఈ మానవ మృగం ఇంత అమానుషానికి పాల్పడగా కోర్టు అతడిని నేరస్తుడిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు  చెప్పింది.

    ఉత్తర ప్రదేశ్ లోని కాస్‌గంజ్ కు చెందిన రవీంద్ర కుమార్ కుటుంబం తనకు 18 వ ఏట 2008లో ఢిల్లీకి వలస వచ్చింది. అతడి తండ్రి ప్లంబర్ గా, తల్లి ఇళ్లలో పాచి పని చేసేది. ఢిల్లీకి వచ్చిన కొన్ని రోజులకు రవీంద్ర కుమార్ విపరీతంగా డ్రగ్స్ కు బానిసయ్యాడు. వీటితో పాటు విపరీతంగా పోర్న్ కూడా చూసేవాడు. వృత్తి రీత్యా కూలి చేసేవాడు. డ్రగ్స్ తో పాటు పోర్న్ వీడియోలకు బానిసైన రవీంద్ర కుమార్ రాత్రి 8 గంటలకే నిద్రపోయేవాడు. అర్థరాత్రి లేచి చిన్న పిల్లల కోసం నిర్మానుష్య ప్రదేశాలు, మురికివాడలు, గల్లీల్లో తిరుగుతుండేవాడు.

    చిన్న పిల్లలు కనిపించకుంటే దాదాపు 40 కిలో మీటర్ల దూరం కూడా నడుచుకుంటూ వెళ్లేవాడు. నిద్రపోతున్న వారిని, కనిపించిన చిన్నారులను మభ్యపెట్టి జన సంచారం లేని ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. తర్వాత వారిపై లైంగికదాడి చేసి హతమార్చేవాడు. ఇలా 2008 నుంచి 2015 వరకు దాదాపు 7 సంవత్సరాల్లో 30 మంది చిన్నారుల ఉసురుతీశాడు. వీడు హతమార్చిన వారిలో 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఎక్కువ.

    పోలీసులకు ఆధారాలు చిక్క కుండా వేర్వేరు ప్రదేశాలలో ఈ అఘాయిత్యాలకు పాల్పడేవాడు. అయితే 2014లో ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి చేసి సమీపంలోని సెప్టిక్ ట్యాంక్ లో పడవేసిన ఘటనలో రవీంద్ర కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన చేసిన హత్యలు, ఆయన సంచరించిన ప్రదేశాల గురించి కూపీ లాగగా 30 హత్యలు చేసినట్లు నిరూపితమైంది. ఈ కేసులపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు మంగళవారం (మే 9)న దోషిగా తేల్చింది. నేరస్తుడికి ఢిల్లీలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం నెలకొంది.

    Share post:

    More like this
    Related

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

        తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

    అల్లుడితో లేచిపోయిన అత్త..!

          మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

          వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పుట్టిన రెండేళ్లకే జీవిత ఖైదు.. కిమ్ ఆకృత్యాలపై అమెరికా గుస్సా..

    Kim actions : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్...