40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Date:

    Wasted the Money
    Wasted the Money, termites damage

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అంటారు. మనకు బాకీ లేకపోతే ఏదీ మన సొంతం కాదు. కాలం తీరిపోయిందంటే ఏదైనా భూమిలో కలిసిపోవాల్సిందే. అందరు బ్యాంకు లాకర్లలో బంగారం, వజ్రాలు దాచుకుంటారు. కానీ అక్కడ మాత్రం ఓ మహిళ రూ.18 లక్షలు బ్యాంకు లాకర్ లో దాచుకుంది. కూతురు పెళ్లి కోసం ఆ డబ్బును కూడబెట్టింది.

    బ్యాంకు వారు మీ లాకర్ ఓ సారి చెక్ చేసుకోవాలని ఆదేశించగా వారి సమక్షంలోనే లాకర్ తెరవగా మొత్తం చెదలు కనిపించింది. దీంతో అంతా షాకయ్యారు. డబ్బంతా చెద పట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. కూతురు పెళ్లికి ఉపయోగపడతాయనుకుంటే ఇలా చెద పట్టడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. బ్యాంకు లాకర్ లో డబ్బు దాచుకోవడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

    రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులో డబ్బు దాచుకోకూడదు. కానీ వారు ఎందుకు అనుమతించారో తెలియదు కానీ డబ్బు మొత్తం నష్టపోయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ కు చెందిన అల్కా పాఠక్ గతేడాది అక్టోబర్ నెలలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచ్ ల రూ. 18 లక్షలు ఉంచింది. ఇటీవల లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్ చేసుకోవడానికి బ్యాంకుకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే కరెన్సీ చెదల పాలైందని గుర్తించారు.

    ఈ ఉదంతంపై ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తోంది. విషయం మీడియాకు లీక్ చేస్తానని చెబుతోంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం లాకర్ లోని వస్తువులు కోల్పోయినప్పుడు, అగ్నిప్రమాదం, భవనాలు కూలిపోయినప్పుడు, మోసం జరిగినప్పుడు లాకర్ కు ఏడాది మొత్తానికి 100 రెట్లు పరిహారం ఇస్తుంది.

    Share post:

    More like this
    Related

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...