Actor Naresh :
సినీనటుడు సీనియర్ నరేశ్.. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన ఇటీవల తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడిపోయి మరో నటి అయిన పవిత్రతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ పెండ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే నరేశ్ కు మూడో భార్య రమ్య రఘుపతి కి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమె పలుమార్లు నరేశ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా నరేశ్ పవిత్రాలోకేశ్ కలిసి జీవించడాన్ని ఆమె తప్పుపట్టింది. అయితే నరేశ్, పవిత్రాలోకేశ్ కలిసి నటించిన మళ్లీ పెళ్లీ సినిమా ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని కించ పర్చారని ఆమె కోర్టు మెట్లెక్కింది.
ఇక ఇటీవల నరేశ్ పవిత్ర జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా వారి వ్యక్తిగత జీవితానికి సంబంధింన పలు అంశాలపై పోలికలు ఉండడంతో, అంతా అదే అనుకున్నారు. అయితే నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. సెన్సార్ బోర్డు అనుమతినిచ్చాక ఆ సినిమాను తాము అడ్డుకోలేమని కోర్టు చెప్పింది. చిత్రం ఒక కల్పితమని సెన్సార్ బోర్డు ధ్రువీకరించాక, దానిని అడ్డుకోవడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. దీంతో పాటు నరేశ్ కు చెందిన మరో అంశంలో కోర్టు తీర్పునిచ్చింది. నానక్ రామ్ గూడలోని నరేశ్ ఇంట్లోకి ఇక రమ్య రఘుపతి వెళ్లడానికి వీలు లేదని చెప్పింది. రమ్య రఘుపతి ఆ ఇంట్లోకి రాకుండా చూడాలని ఆయన కుటుంబసభ్యులు గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి విచారణ అనంతరం నరేశ్ ఇంట్లోకి రమ్య రాకూడదని ఆదేశాలు జారీ చేసింది.
నరేశ్ తన 19 ఏండ్ల వయస్సులో సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో విడిపోయారు. వీరికి ఒకబ్బాయి. అతడే విజయ్ కృష్ణ. ఇక దేవులపల్లి కృష్ణ శాస్ర్తి మనుమరాలిని పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అతడు పెయింటింగ్ అర్టిస్ట్. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక మూడో భార్య రమ్య రఘుపతి. వీరికీ ఒక అబ్బాయి ఉన్నారు. అయితే రమ్య రఘుపతి మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కూతురు. ఇక నరేశ్, రమ్య రఘుపతి ఐదేళ్లుగా విడిగా ఉంటున్నారు. ఇక నరేశ్ ప్రస్తుతుం కోస్టార్ పవిత్రా లోకేశ్ తో సహజీవనం చేస్తున్నారు.