27.9 C
India
Thursday, September 10, 2026
More

    Tribute to Sr NTR : నట సౌర్యభౌముడికి బాలయ్య, జూ.ఎన్టీఆర్ సహా ప్రముఖుల ఘన నివాళి..

    Date:

    Tribute to Sr NTR
    Tribute to Sr NTR, Nandamuri Family

    Tribute to Sr NTR : నందమూరి తారక రామారావు శక జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరస నటా సార్వభౌముడి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న వారంతా ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కొడుకు బాలకృష్ణ, మనుమడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోని పెద్దలు కూడా ఆయనకు నివాళులర్పించారు. మహనీయుడితో కలిసి ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

    ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన ప్రముఖులతో పరిసరాలన్నీ కిక్కిరసాయి. శక పురుషుడిని మనసారా స్మరించుకునేందుకు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తరలివచ్చారు. తమ అభిమాన హీరో, రాముడు, కృష్ణుడు పాత్రలను పోషించి దేవుడిగా మారిన ఎన్టీఆర్ కు తాము కూడా నివాళులర్పించాలని చాలా మంది ఎన్టీఆర్ ఘాట్ కు తరలిచ్చారు. నివాళులర్పించిన వారిలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు.

    ఈ ఘాట్ నుంచే ఎన్టీఆర్ కొడుకు నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. ‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందన్నారు. ఆయన ఒక్క సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా మకుటం లేని మనిషి. తండ్రి గారి ఆశీస్సులు తెలుగు నేతపై తెలుగు వారిపై ఎప్పూడూ ఉంటాయి. టీడీపీ పెట్టి కోట్లాది మంది పేదలకు అన్నగా మారారు. మా దిక్చూచి ఆయన. ఆయన నిత్యం మాతోనే ఉన్నారు.. ఉంటారు. ఆయన పథకాలు ఇప్పటికీ దేశం మరిచిపోలేదు.

    రూ. 2 కిలో బియ్యం ఆహార భద్రతాగా మారింది. మహిళలకు ఆస్తిహక్కు కూడా ఆయన నిర్ణయమే. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఆయన నిత్యం మన గురించే ఆలోచించే వారు. రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా జాతీయ రాజకీయాల్లో ఆయన వెనుకుండి చక్రం తిప్పారు. అంతటి మహోన్నత నేత మా తండ్రిగారు’ అంటూ బాలకృష్ణ అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR Jayanthi : ఎన్టీఆర్ శతజయంతి : జొన్నవిత్తుల పద్య నీరాజనం..

      భారతీయ కవి , సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అంటే...

    End of NTR life : ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో తోడున్నది ఆమెనా..?

    End of NTR life : నందమూరి తారక రామరావు.. అటు...