27.8 C
India
Wednesday, February 18, 2026
More

    NTR Jayanthi – Dr Jai Yalamanchili : ఎన్టీఆర్ శతజయంతి: డా. జై యలిమంచిలి ఆధ్వర్యంలో కదిలిన టీడీపీ దండు

    Date:

    NTR Jayanthi – Dr Jai Yalamanchili : : తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఘనంగా జరుగుతోంది. ఆ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు మనవడు జూ.ఎన్టీఆర్, రామకృష్ణ, నటుడు రాజేంద్రప్రసాద్ సైతం నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

    నటసార్వభౌముడు, యుగ పురుషుడు, కారణ జన్ముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావుకు యూ బ్లడ్ ఫౌండర్, జై స్వరాజ్య్ టీవీ చైర్మన్   డాక్టర్ జై యలమంచిలి ఘన నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

    అనంతరం యూబ్లడ్ ఫౌండర్ డా. జై యలమంచిలి గారు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వైజాగ్ నుంచి తుని మీదుగా రాజమండ్రి వరకూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలతో కలిసి ర్యాలీగా బయలు దేరారు. తునిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా రాజమండ్రికి బయలు దేరారు. ఈ కార్యక్రమాన్ని డా. జై యలిమంచిలి గారు ముందుండి నడిపించారు.

    ఈ సందర్భంగా జై స్వరాజ్య్ టీవీ చైర్మన్ డా. జై యలమంచిలి మాట్లాడుతూ… తెలుగు వారంతా గర్వపడే అరుదైన ఘట్టం, తెలుగువాడు ఉన్నంత వ‌ర‌కూ తెలుగు గుండె కొట్టుకున్నంత వ‌ర‌కూ, “ఎన్ టీ ఆర్” అనే ఈ మూడ‌క్ష‌రాల‌ను విన్నంత‌నే ఈ తెలుగునేల పుల‌క‌రిస్తూనే ఉంటుందని అన్నారు. నందమూరి తారకరామారావు రాష్ట్రానికి, పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఢిల్లీ పాలకుల పెత్తనాన్ని తొలిసారిగా ఎదుర్కొని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, ఆయన మరణించి పాతికేళ్లయినా ఇప్పటికీ ఆయన సేవలను సదా స్మరించుకోవడం ఇది తెలియజేస్తున్నదన్నారు.

    మొట్టమొదటిసారిగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని, ఇదే ఆయనను అగ్రపథాన నిలిపిందన్నారు. దీంతో పాటు రాజమండ్రిలో శత జయంత్యుత్సవాల సందర్భంగా జరుగుతున్న మహానాడుకు తన అనుయాయులతో కలిసి భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు. మహానాడు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, తెలుగు జాతి ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Yalamanchili : సాయంలో కర్ణుడు.. సేవలో మేరునగధీరుడు.. డా.జై

    UBlood Founder Dr. Jai Yalamanchili Garu : పువ్వు పుట్టగానే...

    Rahul Gandhi : అమెరికాలో రాహుల్ గాంధీ సమావేశానికి హాజరైన యూబ్లూడ్ ఫౌండర్ డాక్టర్ జై

    Rahul Gandhi :కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ప్రస్తుతం...