
Anasuya Bold Role in Vimanan Movie: స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.. జబర్దస్త్ షో ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది అనే చెప్పాలి.. ఈమె జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది.. ఈమె యాంకరింగ్ లో కూడా గ్లామర్ చూపించవచ్చు అని బుల్లితెరపై నిరూపించింది.
అయితే ఈ షో చేస్తూనే ఈమె సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంది.. ఇప్పటికే ఈమె క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాల్లో మంచి పాత్రలను చేసి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది.. అయితే బుల్లితెర మీదనే కాదు వెండితెర మీద కూడా గ్లామరస్ పాత్రల్లో నటించడానికి అమ్మడు అస్సలు వెనుకాడదు అని మరోసారి నిరూపించింది.
ప్రజెంట్ ఈమె చేస్తున్న సినిమాల్లో ‘విమానం’ ఒకటి.. ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి అనసూయ రోల్ కు సంబంధించిన లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తుంది. వివాదాలతో ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న అనసూయ ఇప్పుడు విమానం సినిమాలో చేసిన గ్లామర్ తో మరోసారి వార్తల్లో నిలిచింది..
ఇటీవలే ఏకంగా సోషల్ మీడియా వేదికగా బికినీ వేసుకుని చేసిన రచ్చ మాములుగా లేదు అనే చెప్పాలి.. ఈ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి.. ఇక ఇప్పుడు వెండితెరపై వేశ్య పాత్రలో ఈమె చేసిన ఎక్స్పోజింగ్ తో మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.. కేవలం లిరికల్ వీడియోలోనే అనసూయ అందాలు ఈ రేంజ్ లో ఉంటే మొత్తం సినిమాలో మరే రేంజ్ లో ఉన్నాయో అని అంతా చర్చించు కుంటున్నారు. ఈ సాంగ్ లో అమ్మడి బోల్డ్, మ్యానరిజం, తనదైన యాటిట్యూడ్ తో కనిపించగా ఈమె అందాలు ఆకట్టు కుంటున్నాయి.. జూన్ 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.