Beer ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు ఆల్కాహాల్ కామన్. అది ఏ ఫంక్షన్ అయినా కావచ్చు. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. గతంలో మగవారు మాత్రమే మద్యం తీసుకునే వారు కానీ రాను రాను ఆడవారు కూడా ఈ కల్చర్ కు అలవాటు అవుతున్నారు. ముఖ్యగా యూత్ అమ్మాయిలు చిన్న చిన్న బర్త్ డే లాంటివి సెలబ్రేట్ చేసుకుంటే బీర్లు కామన్ అవుతున్నాయి. బయటకు వెళ్లి కొనుక్కోలేరు. కానీ పార్టీ మూడ్ కూడా కరాబు చేసుకోకుండా ఉండాలంటే ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకోవాలి. అలాంటి వారికి ఇప్పుడు ఇంట్లోనే బీర్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దాని గురించి తెలుసుకుందా.
బీరుకు మంచి ఆదరణ ఉంటుంది. మన దేశంలో మద్యం లాగా చూస్తున్నా.. చాలా దేశాల్లో క్యాజువల్ గా తీసుకుంటారు. ఒక్క ఫంక్షన్లకే తీసుకోవాలని అనే రూల్ అక్కడ ఉండదు. దీంతో పాటు ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో బీరు కోసం సపరేట్ షాపులు కూడా వెలుస్తున్నాయి. ఇది వైన్స్ కాదు. ఇక్కడ ఓన్లీ బీర్లుమాత్రమే దొరుకుతాయి. ఎటువంటి మిగతా ఆల్కాహాల్ దొరకదు. ఇలా బీరు మంచి ద్రావణం అని కొందరు బాహాటంగానే చెప్తున్నారు.
మనం రోజూ టీని ఎలా తయారు చేసుకుంటామో ఇప్పుడు బీరును కూడా ఇంట్లోనే ఇన్ స్టంట్ గా రెడీ చేసుకోవచ్చు. సమయం కూడా తక్కువ పడుతుంది. దీని ద్వారా వైన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే బీర్ తయారుచేసుకోవచ్చు. బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్బా అనే జర్మనీ సంస్థ ఉంది. ఈ సంస్థ బీర్ ను ఇంటి వద్ద సులభంగా తయారుచేసుకోవడానికి ఒక ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను తీసుకొచ్చింది. ఈ బీర్ పౌడర్ ను 2 స్పూన్ ల పరిమాణంలో తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో కలిపితే ఇన్ స్టంట్ గా బీరు రెడీ అవుతుందని ఈ కంపెనీ చెప్పింది. దీంతో కిలో బీర్ ట్రాన్స్ పోర్ట్ స్థానంలో ఈ పౌడర్ కేవలం 45 గ్రాములు అవసరమవుతుందని నిపుణుల అంచనా.