37.7 C
India
Saturday, April 27, 2024
More

    Capital Amaravathi : అమరావతే రాజధానట.. చంద్రబాబు ధీమా!

    Date:

    Capital Amaravathi
    Capital Amaravathi, Chandrababu Naidu

    Capital Amaravathi : హైదారాబాద్ కి దీటుగా అమరావతి నిర్మించాలని సంకల్పించామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. “అమరావతి ఎక్కడికి వెళ్లదు, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలో వస్తుంది,  వెంటనే పనులు పెట్టిస్తామని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. వైసీపీ పాలన ముగిసే టైం దగ్గర పడిందని పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

    ఏమిటీ చంద్రబాబు ధీమా..

    ఏపీలో గ‌డిచిన మూడున్నరేళ్లుగా రాజధాని విషయం కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు హ‌యాంలో 2015లో అమరావతిని  రాజధానిగా చేస్తూ శంకుస్థాప‌న చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత‌.. ఏపీకి అత్యద్భుత‌మైన న‌గ‌రంగా రాజ‌ధాని ఉండాల‌ని చంద్రబాబు భావించారు. దానికి అనుగుణంగానే 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేక‌రించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగ‌పూర్‌, దుబాయ్ దేశాల‌కు చెందిన క‌న్సల్టెన్సీల‌ను కూడా రప్పించారు. ఇక‌, ఇక్కడే స‌చివాల‌యం, అసెంబ్లీ, హైకోర్టును కూడా నిర్మించారు.

    ప‌నులు పురోగమిస్తున్న తరుణంలో 2019లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక  రాజధాని నిర్మాణం మరుగున పడిపోయింది. సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల పేరిట కొత్త రాగం అందుకున్నారు. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తాన‌ని అక్కడే ఉంటాన‌ని కూడా ప్రకటించారు. దీంతో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన‌ రైతులు ఉద్యమ బాట పట్టారు. రాష్ర్టం విడిపోయి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకపోవడంతో ఇదేం పాలన అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన చెందవద్దని బాబు ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కు ధీటుగా రాజ‌ధానిని నిర్మిస్తామని ప్రకటించారు. టీడీపీపై విశ్వాసంతో 29 వేల మంది రైతులు భూములిచ్చారని కార్యకర్తలు మరిచిపోవద్దనే గుర్తు చేస్తున్నారు. రాజధాని అంశమే మనల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. మరి రానున్న ఎన్నికల్లో రాజధాని అంశం టీడీపీని ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NV Ramana : రైతులకు రిజర్వేషన్లు కల్పించాలి: మాజీ జస్టిస్ ఎన్వి రమణ

    NV Ramana : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు తగ్గడం...

    TDP Second List : రేపు టీడీపీ రెండో జాబితా.. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    TDP Second List : ఏపీలో ఎటూ  చూసినా ఎన్నికల కోలాహలమే...

    AP Elections 2024 : శ్రీకాకుళం టు అనంతపురం.. ఏపీలో గెలుపు ఎవరిదంటే? ఒక సంస్థ సర్వేలో సంచలన విషయాలు

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు...