World Cup matches Hyderabad : ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ కు దేశం ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచుల నిర్వహణకు షెడ్యూల్ ఖారారైంది. ఇందులో హైదరాబాద్ కు మాత్రం అన్యాయం జరిగింది. ప్రతి స్టేడియంలో కనీసం నాలుగు మ్యాచులు ఆడుతుండగా మన భాగ్యనగరంలో మాత్రం మూడు మ్యాచులే ఆడుతున్నారు. అవి కూడా క్వాలిఫయర్ మ్యాచులే కావడం గమనార్హం. ఇందులో రెండు పాక్ ఆడే మ్యాచులు కాగా మరొకటి న్యూజీలాండ్ మ్యాచ్.
డిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగుళూరు, కోల్ కత, లక్నో, చెన్నై చోట్లలో ప్రతి స్టేడియంలో నాలుగు మ్యాచులు ఆడేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ మన హైదరాబాద్ లో మాత్రం మూడే మ్యాచులతో సరిపెట్టారు. అది కూడా విలువ గల మ్యాచులు కాదు. నామ్ కే వాస్తేగా ఉన్న మ్యాచులు కావడంతో ప్రేక్షకుల్లో ఆగ్రహం వస్తోంది.
హెచ్ సీఏ ఉదాసీన వైఖరి వారికి అనుకూలంగా మారిందనే వాదనలు వస్తున్నాయి. లేకపోతే మంచి రసవత్తరమైన మ్యాచులు మన దగ్గర ఆడకుండా ఇతర చోట్ల ఆడిస్తూ మనకు ప్రాధాన్యం లేని వాటిని అంటగట్టడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు దీనినై మండిపడుతున్నారు. బీసీసీఐ తీరు సరిగా లేదని వివాదాస్పదమైన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఆటతో ప్రారంభం అవుతుంది. 6న పాకిస్తాన్ క్వాలిఫయర్ 1తో హైదరాబాద్ లో ఆడుతుంది. 9న న్యూజీలాండ్, క్వాలిఫయర్ 1 జట్టుతో పోటీ పడుతుంది. 12న పాక్, క్వాలిఫయర్ 2తో తలపడుతుంది. ఇలా మనకు ప్రాధాన్యం లేని మ్యాచులు అంటగట్టి బీసీసీఐ అపహాస్యం చేస్తోంది. దీనిపై మన హెచ్ సీఏ పోరాడి మంచి మ్యాచులు సాధించాల్సి ఉండేది.
హైదరాబాద్ మినహా అన్ని స్టేడియాల్లో టీమిండియా ఆడుతుంది. కానీ మన స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదంటే మనవారి నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుంది. బీసీసీఐ దోరణికి భజన చేసే సంస్కృతి మన వారిలో ఉందని తెలుస్తోంది. లేకపోతే మ్యాచులు ఖరారు చేసేటప్పుడే మనకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా రసవత్తరమైనది ఉండేలా చూడకపోవడం విడ్డూరమే.