
సాహసమే నా ఊపిరిగా నిలిచిన సంచలన కథానాయకుడు కృష్ణ నవంబర్ 15 న మరణించారు. 80 ఏళ్ల వయసులో కృష్ణ గుండెపోటుకు గురి కావడానికి కారణాలు ఏంటో తెలుసా ……. కృష్ణ కు పెద్ద కొడుకు రమేష్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. రమేష్ బాబును హీరోగా పరిచయం చేయడమే కాకుండా అతడ్ని స్టార్ హీరోగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలే చేసారు. రమేష్ బాబును హీరోగా పెట్టి పలు చిత్రాలను నిర్మించారు అంతేకాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు కృష్ణ.
రమేష్ బాబు హీరోగా నటించిన కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి కానీ దురదృష్టం ఏంటంటే …….. కొన్ని సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ హీరోగా మాత్రం రాణించలేకపోయాడు. దాంతో రమేష్ బాబు మద్యానికి అలవాటు పడ్డాడు. రమేష్ బాబు ను ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించిన కృష్ణకు తీవ్ర అసంతృప్తి మిగిల్చిన అంశం. తన పెద్ద కొడుకు రమేష్ బాబుతో ఎక్కువ విషయాలు పంచుకునేవారు కృష్ణ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద కొడుకు రమేష్ బాబు మరణించడంతో కృష్ణ ను తీవ్రంగా కలిచి వేసింది.
ఇక అంతకుముందే తన రెండో భార్య విజయనిర్మల కూడా చనిపోవడంతో కుంగిపోయారు. కృష్ణకు అన్ని విషయాల్లో కూడా తలలో నాలుకలా ఉండేది విజయనిర్మల. అయితే ఆమె మరణంతోనే కృష్ణ ఒంటరి అనే భావనకు లోనయ్యారు.
ఇక సెప్టెంబర్ లో తన మొదటి భార్య ఇందిర మరణంతో కూడా మరింతగా కుంగిపోయారు కృష్ణ. రెండో భార్య , పెద్ద కొడుకు , మొదటి భార్య ఇలా తన జీవితంలో పెనవేసుకుపోయిన ముగ్గురు కూడా మరణించడంతో మరింతగా ఒంటరి అయ్యారు కృష్ణ. దాంతో ఆ ప్రభావం కృష్ణ ఆరోగ్యంపై పడింది.