Bharat Jodo Nyaya Yatra : దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశానికి గతంలో భారత్ జోడోయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమ వుతున్నారు. ఈ యాత్ర ఈనెల 14న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ప్రారంభమై గుజరాత్లోని మహాత్మా గాంధీ పుట్టిన ఊరు అయిన పోరు బందరు వద్ద ముగుస్తుంది. ఈ యాత్ర 66 రోజుల్లో 6,700 కిలోమీటర్లు మేర రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్రను చేయబోతున్నారు.
మొదట భారత్ న్యాయ యాత్ర గా నామ కరణం చేసిన రాహుల్ గాంధీ గతంలో చేసిన జోడో యాత్ర ను పేరు ను చేరుస్తూ భారత్ జూడో న్యాయ యాత్ర గా పేరును ఖరారు చేశారు. ఈశాన్య రాష్ట్రా ల మీదు గా రాహుల్ గాంధీ చేస్తున్న భరత్ జోడు న్యాయ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో నిర్వ హించిన జూడయాత్రకు విశేష స్పందన లభించింది.
గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర గా వస్తు న్నారని తెలుసుకున్న యువకులు ప్రజలు ఆ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ చేసిన జూడో యాత్ర వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పవచ్చు.. తెలంగాణలో అధికారాన్ని కూడా వారు చేపట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోని యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావాలని యువ నేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.