Priyanka Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అస్వ స్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఉత్త రప్రదేశ్‌లో జరగబోయే భారత్ జోడో న్యాయ యాత్ర కోసం ఎంతగానో ఎదురుచూశా. కానీ, ఈరోజే అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటా అని ప్రియాంక పేర్కొన్నారు.
మణిపూర్ నుంచి ముంబై వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక కూడా పాల్గొం టారని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయి తే, ఇప్పుడు ప్రియాంక అనారోగ్యానికి గురికావ డంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు.
కాగా, శుక్రవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు, ఆ తర్వాత 24, 25వ తేదీల్లో రాహుల్ యాత్ర యూపీలో కొనసాగనుంది. అయితే, ప్రియాంక గాంధీ ఈ తేదీల్లో ఏ రోజు రాహుల్ యాత్రలో పాల్గొంటారో ప్రస్తుతానికి స్పష్టత లేదు.
కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలో ని రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని సోనియా సూచన ప్రాయంగా చెప్పడంతో.. అక్కడ్నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.సోనియాం గాంధీ ఇప్పటికే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.