Bhola shankar : స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ ఈ రోజు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసారు. మరి భోళా శంకర్ తో చిరంజీవి ఈ రోజు బాక్సాఫీస్ బరిలో దిగారు.
తమిళ్ లో 2015లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు నుండి ప్రమోషన్స్ బాగా చేసారు.. ఈ క్రమంలోనే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని కూడా మెగా ఫ్యాన్స్ ను అలరించడమే కాకుండా భోళా శంకర్ పై అంచనాలు పెంచేసాయి.. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తుంది.
ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా.. మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటించింది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ లో నటించాడు..
ఈ సినిమా సుమారు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. భోళా శంకర్ సినిమాకు రికార్డ్ స్క్రీన్స్ కు ప్లాన్ చేసారు.. మొత్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి 900 థియేటర్స్ లో రిలీజ్ చేసారు.. ఇక ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్స్ లో ఓవర్సీస్ లో 500 స్క్రీన్స్ లకు పైగానే రిలీజ్ చేసారు.. ప్రపంచ వ్యాప్తంగా 1500 స్క్రీన్స్ లో విడుదల చేయగా ఓపెనింగ్స్ బాగా వస్తాయనే అనిపిస్తుంది..
ఫస్ట్ డే ఇండియా వైడ్ గా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందట.. ఇక ఓవర్సీస్ లో కలిపితే 30 నుండి 35 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను సాధించే అవకాశం ఉందని టాక్.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమాల కంటే ఓపెనింగ్స్ తక్కువే వచ్చే అవకాశం ఉంది.. అయితే ఈ సినిమాకు జైలర్, ఓ మై గాడ్, గదర్ 2 సినిమాలు గట్టి పోటీ నిలుస్తున్నాయి..