33.2 C
India
Monday, February 26, 2024
More

  Padmavibhushan : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ‘జైచిరంజీవా!’.. పద్మవిభూషణ్ రావడంపై ఎన్ఆర్ఐల సెలబ్రేషన్స్

  Date:

  Padmavibhushan
  Padmavibhushan Chiranjeevi Celebrations at Times Squire New York

  Padmavibhushan Chiranjeevi : తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలుగు సినీ పరిశ్రమ మూడో నేత్రం మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమాకు పరుగులు నేర్పిన నటుడు ఆయన. తెరపై చిరు కనపడితే చాలు చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ఆనందంతో కేరింతలు కొడుతారు. కమల్ హాసన్ నటన, రజినీకాంత్ స్టైల్.. ఈ రెండు కలగలిపిన ఏకైక నటుడు. డ్యాన్స్, ఫైట్లు, స్టైలిష్ యాక్టింగ్ ,కామెడీ టైమింగ్..ఇలా ఒక్కటేమిటి నటనలో నవరసాలు పలికించి కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత ఆయనది.

  ఆయన కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఖైదీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. అందరి కళ్లను తనవైపు తిప్పుకున్నారు. అనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడూ వెనుదిరిగింది లేదు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు సినిమాకు ఆయనే  నంబర్ వన్, మెగాస్టార్. తాను అగ్రహీరో కావడమే కాదు దాదాపు ఇప్పటి తెలుగు సినిమా హీరోలు, మిగతా టెక్నిషియన్స్ అందరికీ ఆయనే స్ఫూర్తి ప్రదాత. తన కుటుంబంలో కూడా పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు వచ్చారంటే అది చిరు చలువే.

  చిరంజీవి నటుడిగానే కాదు.. సామాజిక సేవలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. బ్లడ్ బ్యాంకు, ఐబ్యాంకులు గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సేవ అందిస్తున్నాయి. లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్నాయి. అలాగే కరోనా కాలంలో ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటిచెప్పారు. నటుడిగా, సామాజిక సేవకుడిగా కేంద్రం ఆయన సేవలను గుర్తించి పద్మభూషణ్ తో పాటు తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించింది.

  చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంతో తెలుగునేల పులకించిపోయింది. ప్రతీ తెలుగు బిడ్డ ప్రతీ ఒక్కరు తనకే పద్మవిభూషణ్ వచ్చిందా అనే సంతోషంతో మురిసిపోయారు. ఇక విదేశాల్లో ఎన్ఆర్ఐలు సైతం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై యూఎస్ లోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వైర్ వద్ద ఎన్ఆర్ఐలు అందరూ కేక్ కట్ చేసి జై చిరంజీవా.. నినాదాలతో హోరెత్తించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికే గర్వకారణమని వక్తలు హర్షం వ్యక్తం చేశారు.

  All Images Courtesy by Dr. Shiva Kumar Anand

  Share post:

  More like this
  Related

  Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

    Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

  Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

  Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

  Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

  Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Hanuman Movie : హనుమాన్ సినిమా గురించి వైరల్ గా చిరు కామెంట్స్

  Hanuman movie : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా...

  Chiranjeevi : డెడికేషన్ అంటే ఆయనదే! ఒకే షర్ట్ ను అన్ని సంవత్సరాలు వాడారట..

  Megastar Chiranjeevi : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీకే...

  Pawan Kalyan : ఆ విషయంలో చిరంజీవే బెటర్.. పవన్ చేసిందేమీ లేదు!

  Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శల...

  Megastar Chiranjeevi : చిరంజీవితో నటించడం నరకం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్...