41.2 C
India
Sunday, May 5, 2024
More

    Balakrishna vs JR NTR : చంద్రబాబు అరెస్ట్ : స్పందించని ఎన్టీఆర్ పై బాలకృష్ణ సీరియస్ కామెంట్స్

    Date:

    Balakrishna vs JR NTR : చంద్రబాబు అరెస్టుపై కొందరు స్పందించడం లేదు. కానీ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కొందరు తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోసమే కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారు.

    చంద్రబాబు నిజాయితీపై మాకు నమ్మకం ఉంది. న్యాయవ్యవస్థ కూడా ద్రోహం చేయదు. వైసీపీ కక్షలను అడ్డుకుంటాం. స్వచ్ఛంగా బాబు బయటకు రావడం ఖాయం. తెలంగాణలో కూడా చాలా మంది బాబు అరెస్టుకు మద్దతుగా దీక్ష చేపడుతున్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపో యిందని అనుకుంటున్నారు కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం. మా ఉనికి చాటుతాం.

    కేసులకు భయపడం. మడమ తిప్పం. అనుకున్నది సాధిస్తాం. తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తాం. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. మేమేంటో నిరూపిస్తాం. టీడీపీ సత్తా చాటుతాం. ప్రత్యర్థులకు సవాలు విసురుతాం. టీడీపీతోనే డెవలప్ మెంట్ సాధ్యం. హైటెక్ సిటీకి గుర్తింపు తీసుకొచ్చింది బాబే. అందుకే బాబు అరెస్టును ఐటీ ఉద్యోగులు ఖండిస్తున్నారు.

    సెక్షన్ 17ఏ ను పట్టించుకోకుండా అక్రమ కేసులు బనాయించడం వైసీపీకే చెల్లింది. బీజేపీతో కూడా పొత్తు విషయంలో మా అక్క పురందేశ్వరి చూసుకుంటారు. అందరు బాబు వెంట ఉన్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే మాకు సంబంధం లేదు. ఎన్టీఆర్ మౌనం వెనుక కారణాలు మాత్రం తెలియడం లేదు. కానీ ఎందుకో ఈ విషయంలో ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

     

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...