Vaishnavi Chaitanya యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ‘బేబీ’ సినిమాలో ఆమె నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. ‘బేబి’ సినిమా క్రేజ్ అంతా తన ఖాతాలోనే వేసుకుంది వైష్ణవి. మొత్తం మూవీ ఆమె భూజాలపైనే మోసేసిందని టాక్. యూ ట్యూబర్ గా ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను డైరెక్టర్ సాయి రాజేశ్ తెలివిగా ఉపయోగించుకున్నాడు.
ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ దక్కించుకుంది. మూవీ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌గెస్ట్‌గా వచ్చారు. ఇందులో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘చిరంజీవి సార్.. మీరు యాక్టింగ్ కు గాడ్.. మాకు ఎంతో ఇన్సిపిరేషన్..’ అంటూ చెప్పింది. ప్రస్తుతం ఆమె మాట్లాడింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామ్ లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్‌లో కూడా వైష్ణవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. దీనితో పాటు ఆమెకు మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయట. తన తర్వాతి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక, బేబీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. చిన్న సినిమాగా వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతుంది. రిలీజ్ కు ముందే యూత్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయంటే సందేహం లేదు. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి వారెవ్వా అనిపించుకుంది.