32.2 C
India
Monday, April 29, 2024
More

    Comedian Sudhakar : తమిళ ఇండస్ట్రీలో చేసేప్పుడు మద్రాస్ లో ఆస్తులు కొన్న.. ఇప్పుడు లేవు.. సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

    Date:

    Comedian Sudhakar
    Comedian Sudhakar

    Comedian Sudhakar : ప్రజెంట్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ భూతే.. ఇది అక్షర సత్యం అది కామెడీ అని అర్థం అయ్యే సరికే.. వియ్యం అందేది.  కానీ ఒకప్పుడు కామెడీ పొట్ట చెక్కలయ్యేది. దర్శకుడు జంధ్యాల సినిమాల్లో ఒక్కో డైలాగు చక్కటి అర్థవంతంగా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకొని మరీ నవ్వేవారు. జంధ్యాల అంటే ఇప్పుడున్న జనరేషన్ కు తెలిసే అవకాశం చాలా తక్కువ. ఇక అప్పటి కమేడియన్ల గురించి తెలుసుకుంటే చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, సినియర్ నరేశ్, బ్రహ్మానందం ఇలా చాలా మంది ఉన్నారు. వారితో పాటే నవ్వులను పంచారు కమేడియన్ సుధాకర్. అయితే ఆయన చనిపోయాడంటూ ఈ మధ్య వచ్చిన వార్తలను ఆయన ఓ వీడియో రిలీజ్ చేసి మరీ ఖండించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఒక షోలో కనిపించారు ఆయన. అసలు గుర్తు పట్టలేనంతా మారిపోయారు.

    రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘నేను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో మంచి పాత్రలు, సినిమాలను చేశాను. కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పని చేశాను. ఏ క్యారెక్టరైనా సంతోషంగా చేసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్‌ ఎంఎస్ నారాయణ. ఇక ఇష్టమైన ప్రదేశం ఊటి, అప్పట్లో బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు.

    మెగాస్టార్ చిరంజీవి, నేను ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘యముడికి మొగుడు’లో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టుపట్టాడు. అలా నేను ఆ సినిమాలో చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు దక్కింది. తమిళనాడులో నాకు ఆస్తులుండేవి, కానీ అమ్మేశాను. తమిళంలో చేసినా తెలుగులో ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఇక్కడ సెటిలయ్యాను. నా కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు’. అని సుధాకర్ చెప్పారు.

    18 మే, 1959న జన్మించిన సుధాకర్‌ సినిమాలపై ఉన్న ఇంట్రస్ట్ తో మద్రాస్‌ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్‌తో కలిసి రూమ్ షేర్ చేసుకునేవాడు. దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడగా సుధాకర్‌ను హీరోగా పెట్టి ‘కిళుక్కెమ్‌ పొగుమ్‌ రెయిల్‌’ సినిమా తీశాడు. ఇందులో రాధిక ఆయన సరసన నటించింది. ఈ సినిమా హిట్‌ కావడంతో వీరి కాంబినేషన్‌ తర్వాత కొన్ని సినిమాల్లో రిపీట్ అయ్యింది. తమిళంలో వరుస సినిమాలు అందులో బాక్సాఫీస్ మూవీస్ చేసిన తర్వాత రూటు మార్చుకున్నారు. తెలుగుపైనే ఎక్కువ దృష్టి సారించాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయాడు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Comedian Sudhakar Son : కమెడియన్ సుధాకర్ కొడుకుకు చిరంజీవి సాయం

    Comedian Sudhakar son : కమెడియన్ సుధాకర్, మెగాస్టార్ చిరంజీవి మంచి...

    Comedian Sudhakar : ఎలా ఉండే కమెడియన్ సుధాకర్.. ఎలా అయిపోయాడో చూడండి.. షాకింగ్ పిక్..

    సుధాకర్.. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. నవ్వించాడు. సుధాకర్ పక్కన...

    Comedian Sudhakar : రియల్ ఫ్యాక్ట్ చెక్ : కమెడియన్ సుధాకర్ చనిపోయాడా? అసలు నిజం ఏమిటి?

    Comedian Sudhakar : ఈ రోజు ఉదయాన్నే ఒక వార్త ఆడియెన్స్...