
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలు చూసే కార్యదర్శిని నియమించుకోవడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారిని తన పార్టీ కార్యక్రమాలు చూసేందుకు నియమించుకోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేసీఆర్ ఇలా చేయడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు పనులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై బీజేపీ, కాంగ్రెస్ తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారిని నియమించడం ఏమిటని అడుతున్నారు. కానీ కేసీఆర్ తీరు ఇలా ఉండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడే ఇంతలా దిగజారడం వివాదాస్పదమవుతోంది. దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో అర్థం కావడం లేదు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీరు సమంజసంగా లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ అధికారిని నియమించడమే విచిత్రంగా ఉంది. ఇదేమైనా పాత కాలమా? ప్రతి విషయంలో సాంకేతికత పెరిగింది. దీంతో రహస్యాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. అయినా ఇలా మొండిగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏం సమాధానాలు చెబుతారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆలోచన ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎందుకు విమర్శల పాలవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను ప్రైవేటు వ్యక్తికి అప్పగించాలి. కానీ ప్రభుత్వ కార్యదర్శి అయిన వ్యక్తిని తమ కార్యక్రమాలు చూసేందుకు అతడికి రూ. 1.50 లక్షలు జీతం ఇవ్వడం ఏమిటని అడుగుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేరుకే ప్రభుత్వ కార్యదర్శి కానీ తీసుకుంటున్న జీతం ప్రభుత్వానిది. చేస్తున్న పని బీఆర్ఎస్ ది. దీంతో బీఆర్ఎస్ డైలమాలో పడింది. ఈ మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. కానీ విమర్శల పాలు కావడం పార్టీకి అంత మంచిది కాదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.