Diabetes Controlled : ఇటీవల షుగర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది. ఇంగ్లిష్ మాత్రలు మింగుతూ కంట్రోల్ ఉంచుకోవాల్సి వస్తోంది. దీంతో సైడ్ ఎఫెక్స్ట్స్ వస్తాయని తెలిసినా తప్పడం లేదు. వాటిని ఆశ్రయించక వేరే మార్గం కనిపించడం లేదు.
ఈనేపథ్యంలో ఫూల్ మఖానా గింజలు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచే గింజలుగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు కలిగిస్తాయి. మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్, వాటి ప్రభావాలను తొలగించడంతో పాటు ఫ్రాంక్రియాస్ పనితీరు మెరుగుపరచేందుకు కారణమవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి మేలు చేస్తుంది.
ఇందులో మెగ్నిషియం ఉంటుంది. ఇన్సులిన్ బాగా పనిచేస్తే షుగర్ సమస్య ఉండదు. పీచు పదార్థం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో వీటిని తినడం వల్ల మనకు పలు లాభాలు కలుగుతాయి.
ఫూల్ మఖానా గింజలు గుండెకు మేలు చేస్తాయి. ఇందులో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇవి తినడం వల్ల రక్తపోటు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది. అందుకే వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం చాలా మంచిదనే విషయం తెలుసుకుని వాడుకోవడం ఉత్తమం.