Dil Raju :
మేధావులు మొండివారంటారు. వారనుకున్నదే చేస్తారు. దానికోసమే శ్రమిస్తారు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో జరుగుతున్నది అదే. సినిమా వ్యయం అమాంతం పెరిగిపోతోంది. నిర్మాత దిల్ రాజు చాలా పొదుపుగా ఉంటారు. దర్శకుడు శంకర్ ఎక్కువగా ఖర్చుపెడతారని టాక్. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం కుదరడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ భవితవ్యం అంధకారంలో పడుతోంది.
చీటికి మాటికి వ్యయం పెరగడం వల్ల ఇబ్బందులొస్తాయని దిల్ రాజు అంటుంటే సినిమా అన్నాక బడ్జెట్ ఖర్చవుతుందని శంకర్ చెబుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. శంకర్ తో సినిమా తీయాలంటే అందరు భయపడుతుంటారు. సినిమా ఆయనకు అనుగుణంగా రాకపోతే మళ్లీ తీస్తారు. దీంతో వ్యయం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో దిల్ రాజు తల పట్టుకుంటున్నాడు.
సినిమా పూర్తయ్యే వరకు ఏం మాట్లాడొద్దని అనుకుంటున్నాడట. ఎందుకంటే సినిమా మధ్యలో ఆపేస్తే తీసిందంతా పనికి రాకుండా పోతుంది. అందుకే సినిమా పూర్తి కావాలని సహనంతో ఉంటున్నాడట దిల్ రాజు. శంకర్ వ్యవహార శైలి నచ్చడం లేదట. సినిమా అప్పజెప్పిన పాపానికి అన్ని మూసుకుని డబ్బులు ఇస్తున్నాడట. ఇలా శంకర్ తో సినిమా తీయాలంటేనే నిర్మాతలకు ధైర్యం ఉండాలట.
సినిమా కూడా అదే రేంజిలో ఉండాలని శంకర్ ఆశిస్తుంటాడు. తన మార్కు ఉండాలని చూస్తుంటాడు. రాజమౌళి కూడా శంకర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాడనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి శంకర్ దర్శకత్వమంటే ఓ రేంజిలో ఉంటుంది. ఆయన గత చిత్రాల శైలి చూశాం కదా. అదే ఊపు కొనసాగాలంటే ఖర్చు పెట్టక తప్పదు మరి. ప్రస్తుతం శైలేష్ కొలను మార్గదర్శకత్వం చేస్తున్నాడని అనుకుంటున్నారు.