Director Shankar-Prabhas : తెలుగులో స్టార్ డైరెక్టర్ అంటే రాజమౌళి తమిళంలో శంకర్ పేర్లు వినిపిస్తాయి. రాజమౌళి శంకర్ శిష్యుడే అనే విషయం చాలా మందికి తెలియదు. శంకర్ దర్శకత్వం అంటే మామూలు రేంజ్ లో ఉండదు. సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాడు. అర్జున్ తో జెంటిల్మెన్, ఒకేఒక్కడు, కమల్ హాసన్ తో భారతీయుడు, విక్రమ్ తో అపరిచితుడు, ఐ, రజనీకాంత్ తో శివాజీ, రోబో లాంటి వినూత్న సినిమాలు తానేంటో నిరూపించుకున్నాడు. దక్షిణాదిలోనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
తాజాగా కమల్ హాసన్ తో భారతీయుడు-2 మొదలు పెట్టినా ఎందుకో అది పట్టాలెక్కడం లేదు. రాంచరణ్ తో గేమ్ చేంజర్ తీస్తున్నా దాని గురించి కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అసలు ఈ సినిమాలు తీస్తారా? లేక మధ్యలోనే వదిలేస్తారా? అనేది తేలడం లేదు. ఈ నేపథ్యంలో శంకర్ గురించి మరో పుకారు వస్తోంది. శంకర్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
శంకర్ మేకింగ్ కు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు మంచి సంబంధం ఉంటుంది. వారిద్దరి మధ్య సినిమా వస్తే ప్రేక్షకులకు పండగే అంటున్నారు. దీంతో వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా? వీరి కలయికలో నిజంగానే సినిమా వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి తరువాత ప్రభాస్ కు సరైన విజయం లేదు. తీసిన అన్ని సినిమాలు ప్లాపులుగానే మిగిలిపోయాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు ప్రభాస్ రేంజ్ ని మరింత తగ్గించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ కు ఓ హిట్ కావాలి. అతడి బాడీ లాంగ్వేజ్ ను సరిగా చూపించే దర్శకుల్లో శంకర్ అయితేనే బాగుంటుందని అంటున్నారు.