Dil Raju :
సాధారణ ఎన్నికలను కనిపించేలా జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వచ్చాయి. 48 ఓట్లకు 31 ఓట్లతో దిల్ రాజు అధ్యక్షుడిగా గెలుపొందారు. 48 ఓట్లకు జరిగిన ఎన్నికలు కూడా హోరా హోరీగా జరిగాయి. ప్రత్యక్ష రాజకీయాలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. ఇంత చిన్న ఎన్నికలకు కూడా ఇంత రాద్దాంతం ఎందుకని సినిమా పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం దిల్ రాజు ప్యానెల్ ఆపోజిట్ సీ కళ్యాణ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేసింది. ఎన్నికను 4 సెక్టార్లలో నిర్వహించారు. ప్రొడ్యూసర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టర్.
ఎగ్జిబిటర్ సెక్టర్ కు సంబంధించి 16 మంది సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ సెక్టార్ పోతే మిగిలిన ప్రొడ్యూసర్, స్టూడియో, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన 3 సెక్టార్లకు సంబంధించి ఓటర్లు తమ ఓటును వేశారని సీ కళ్యాణ్ మీడియాకు తెలిపారు. కానీ, ఆ తర్వాత ఎగ్జిబిటర్లు అమ్ముడుపోయారంటూ ఫలితాలను చూసి కళ్యాణ్ కామెంట్ చేశాడు. ఎవరం గెలిచినా ఫిలిం ఛాంబర్, సినిమా డెవలప్‌మెంట్ కు కలిసి పని చేస్తామని.. దిల్ రాజుకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పారు.
ఎన్నికలపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా సంచలన కామెంట్స్ చేశాడు. అసలు సభ్యులు దేనికి పోటీపడుతున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కాలేదన్నారు. ఎన్నికల వాతావరణం చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు బాధపడాలో తెలియలేదన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ కు అధ్యక్షుడిగా పనిచేశానని, ఎన్నికలను చూశానని చెప్పారు. ఇలాంటి వాతావరణాన్ని చూడలేదన్నారు. ప్రచారం చూస్తుంటే భయం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.