Alcohol :
ఏముందిలే రోజుకు ఒక పెగ్గుతో ఏమవుతుంది అనుకునే వారు ఎక్కువగా ఉంటారు. పైగా వీరి తాగుబోతు కథలకు సాక్షాత్తు వైద్యులే తాగమంటున్నారు అంటూ సాకు కూడా చెప్తారు. పాపం నెపం వారిపై నెట్టేసి రోజుకు పెగ్గు చొప్పున తాగడం మొదలు పెడతారు. అయితే మద్యం ఏదైనా ఎంత తీసుకున్నా నష్టమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కాదు వారానికి ఒకసారి కూడా తాగడం మంచిది కాదు అని చెప్తున్నారు. ఈ న్యూస్ నిజంగా మందు బాబులకు కిక్కు దిగిపోయేదే. మీరు ఏ మేరకు ఎంత తాగినా ఫలితం మాత్రం అదే అంటూ హెచ్చరిస్తున్నారు.
మద్యం అన్ని రకాలుగా మనిషిని డ్యామేజ్ చేస్తుంది. ఇటు సోషల్ గా.. అటు ఎకనామికల్ గా.. ఫ్యామిలీ పరంగా కూడా మద్యపానం మంచిదికాదు. సమాజం తాగుబోతుగా చూడడంతో పాటు కనీస విలువ కూడా ఇవ్వదు. ఇక తాగుబోతులు పనిపై శ్రద్ధ పెట్టక తాగుడుకు డబ్బులు దొరకక ఎకనామికల్ గా తీవ్రంగా నష్టపోతారు. ఇక ఫ్యామిలీకి సరైన సమయం కూడా ఇవ్వకపోవడంతో అందరిలో ఉన్నా ఎవ్వరూ పలకరించక ఒంటరై పోతారు. ఇలా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మధ్యం అందుకే మద్యంకు దూరంగా ఉండాలని పెద్దల నుంచి వైద్యుల వరకు అందరూ సూచిస్తుంటారు.
ఇక, ఇటీవల దీనిపై ఒక అద్యయనం చేశారు శాస్త్రవేత్తలు. రోజుకు పెగ్గు మాత్రం తాగే వారిలో ఆరోగ్య లక్షణాలను పరిశీలించారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లోని 19వేల మందిపై చేసిన అధ్యయనంలో చాలా విషయాలు బయట పడ్డాయి. మితంగా తాగినా (అంటే రోజుకు పెగ్గు చొప్పున) హైబీపీ లేదా లోబీపీ, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయని గుర్తించారు. అయితే ఇందులో ప్రత్యేకమైన ప్రయోజనాలు మాత్రం ఏమీ కనిపించలేదన్నారు. మందు బాబులు జర జాగ్రత్త పెగ్గు పెగ్గు అంటే మాత్రం రోగాలే గతి అంటూ హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.